ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ జిల్లాలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలి ఐదుగురు మృతిచెందారు.
ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ జిల్లాలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలి ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. కళ్యాణ్‌సింగ్‌పూర్ బ్లాక్‌లోని ఉపర్సజ గ్రామంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు కింద నిలిచిపోయిన వర్షపునీటిలో బాధితులు స్నానాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా కల్వర్టు కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకుని వారు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
ప్రమాద స్థలంలో శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. అయితే శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
