Asianet News TeluguAsianet News Telugu

OCD : భర్త లాప్ టాప్, ఫోన్ ను డిటర్జెంట్ తో కడిగిన భార్య.. విడాకులు కోరిన టెకీ...

కొద్ది రోజుల క్రితం భార్య తల్లి మరణించింది. దీంతో ఇంటిని బాగా శుభ్రం చేయాలన్న పేరుతో పిల్లలను, భర్తను 30 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంచింది. శుభ్రం చేసే క్రమంలోనే టెక్కీ అయిన భర్త ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను డిటర్జెంట్‌తో కడిగి ఎంచక్కా శుభ్రం చేసింది.

OCD wife washed techie laptop and phone with detergent, husband wants divorce in bengaluru
Author
Hyderabad, First Published Dec 2, 2021, 12:47 PM IST

బెంగళూరు : బెంగళూరులో విచిత్రం జరిగింది. ఓ టెకీ భార్య అతని లాప్ టాప్, ఫోన్ ను శుభ్రంగా సర్ఫ్ వేసి మరీ కడిగేసింది. దీంతో లబోదిబో మన్న ఆ టెకీ తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. వివరాల్లోకి వెడితే..

ఈ కేసులో 35 యేళ్ల ఆ మహిళకు తీవ్రమైన అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD)గా అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె తల్లి మరణించింది. దీంతో ఇంటిని బాగా శుభ్రం చేయాలన్న పేరుతో పిల్లలను, భర్తను 30 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంచింది. శుభ్రం చేసే క్రమంలోనే టెక్కీ అయిన భర్త laptop and phoneను detergentతో కడిగి ఎంచక్కా శుభ్రం చేసింది.

దీంతో షాక్ అయిన ఆ భర్త.. covid-19 వ్యాప్తి తర్వాత తన భార్య తీవ్రమైన పరిశుభ్రత అలవాట్లతో విసిగిపోయానంటూ... పోలీసులను ఆశ్రయించాడు. భార్య చేసిన పనికి కోపానికి వచ్చాడు. ఈ కేసులో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమవడంతో, భర్త ఇప్పుడు విడాకులు కోరుతున్నాడు.

ఆర్‌టీ నగర్‌కు చెందిన సంధ్య, గిరీష్ (పేర్లు మార్చాం)లు 2009లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత నూతన వధూవరులిద్దరూ ఇంగ్లాండ్‌కు వెళ్లారు. భర్త IT employee కావడంతో ఆన్-సైట్ అసైన్‌మెంట్‌ మీద అక్కడికి వెళ్లి అక్కడే తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

సంధ్య MBA గ్రాడ్యుయేట్. లండన్ లోని తమ ఇంటిని అద్దంలా ఉండేది. ఇది భర్తకు కూడా బాగా నచ్చేది. అయితే పెళ్లైన రెండేళ్ల తరువాత వారికి మొదటి సంతానం కలిగింది. అంతే పరిస్థితులు మారిపోయాయి. ఎంతగా అంటే అధ్వాన్న స్థాయికి దిగజారడం మొదలుపెట్టాయి. 

ఎంబీబీఎస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, ఒకరి అరెస్ట్.. చెల్లి పెళ్లికి పిలిచి దారుణం....

భర్త ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతిసారీ తన బూట్లు, బట్టలు, సెల్‌ఫోన్‌ను శుభ్రం చేయమని భార్య విసిగించేది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.. అని బెంగళూరు నగర పోలీసు వనితా సహాయవాణి (మహిళల హెల్ప్‌లైన్) పరిహార్ సీనియర్ కౌన్సెలర్ BS సరస్వతి అన్నారు. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు. 

ఆ తరువాత UK నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఈ జంట ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెషన్‌లకు వెళ్లారు. తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడటం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వారికి రెండవ కుమారుడు జన్మించాడు.

కరోనాతో మళ్లీ మొదటికి..

2019లో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల సంధ్య OCD మరింత తీవ్రమైంది. వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో ఆమె చెంచాలు, ఫ్లోర్‌మ్యాట్‌లు, గృహోపకరణాలతో సహా ఇంట్లో ఉన్న ప్రతిదాన్ని పదే పదే కడగడం, శుభ్రపరచడం ప్రారంభించింది. ఇక లాక్‌డౌన్ సమయంలో, భర్త ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు.. శుభ్రత పేరుతో.. భర్త ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ లను డిటర్జంట్ వేసి కడిగింది. దీంతో భర్త షాక్ అయ్యాడు. 

ఈ మేరకు భర్త తన ఫిర్యాదులో పేర్కన్నాడు. అంతేకాదు శుభ్రత పేరుతో ఆమె రోజుకు ఆరు కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తుందని చెప్పాడు. ఇంకో వింతైన షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె స్నానం సబ్బును శుభ్రం చేయడానికి ఒక ప్రత్యేకమైన సబ్బు తన దగ్గరుందని చెప్పిందని.. సరస్వతి చెప్పుకొచ్చారు.

సంధ్య తల్లి గత ఏడాది అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత, ఆమె తన భర్త, పిల్లలను ఇంటి నుండి బయట ఉండమని బలవంతం చేసింది. ఆ తరువాత ఇల్లు మొత్తాన్ని 30 రోజుల పాటు డీప్ క్లీనింగ్ చేసింది. “ పిల్లలు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యూనిఫాంలు, బూట్లు, బ్యాగ్‌లను ఉతకమని బలవంతం చేసేది. దీంతో అతను తన పిల్లలిద్దర్నీ తీసుకుని తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది, ”అని కౌన్సెలర్ చెప్పారు. పిల్లలకి ఇప్పుడు 11 మరియు 9 సంవత్సరాలు ఉణ్నాయి. 

అయితే, పోలీసులు ఈ కేసును పరిహార్‌కు రిఫర్ చేశారు. నవంబర్‌లో దీనిమీద పరిహార్ లో మూడు కౌన్సెలింగ్‌లు జరిగాయి. కానీ ఫలించలేదు. మహిళకు ఉన్నది విపరీతమైన OCD అని అనుమానిస్తూ, కౌన్సెలర్ సహాయం తీసుకోవాలని సూచించారు, కానీ ఆమె దీనికి ఒప్పుకోలేదు. తాను బాగానే ఉన్నానని తన పరిశుభ్రత అలవాటు అత్యంత 'సాధారణం' అని పేర్కొంది.

భర్తపై ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్న మహిళ 
భార్య ఓసీడీ భరించలేక పోతున్నానంటూ భర్త ఇప్పుడు విడాకులు కోరుతున్నాడని పరిహార్ హెడ్ రాణి శెట్టి చెబుతున్నారు. దీనికి తగిన ప్రక్రియ కొనసాగుతోంది చెప్పారు. త్వరలోనే మహిళకు తుది నివేదిక అందిస్తామన్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉందనితన ప్రవర్తన అసాధారణంగా ఉందని పేర్కొంటూ తనను వేధించినందుకు తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆ మహిళ యోచిస్తోందని ఆమె తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios