Asianet News TeluguAsianet News Telugu

నుస్రత్ జహాన్ కు ఊరట.. నిఖిల్ జైన్ తో తన పెళ్లి చట్టబద్ధంగా చెల్లదంటూ తీర్పునిచ్చిన కోల్ కతా న్యాయస్థానం...

విభేదాల నేపత్యంలో తమ వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ నిఖిల్ జైన్ కోల్ కతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ, ముస్లిం అయిన వారిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింత పెళ్లి చేసుకోనందున, వారి ఏకాభిప్రాయ కలయికను వివాహంగా పరిగనించలేమని జడ్జి తెల్చి చెప్పారు. 

Nusrat Jahan's marriage to Nikhil Jain has been declared illegal by a Kolkata court
Author
Hyderabad, First Published Nov 18, 2021, 11:39 AM IST

కోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి Nusrat Jahan, వ్యాపారి నిఖిల్ జైన్ ల వివాహం ‘చట్టబద్ధంగా చెల్లదు’ అని కోల్ కతా న్యాయస్థానం ప్రకటించింది. టర్కీలోని బోడ్రమ్ లో 19.06.2019న వారి హద్య జరిగినట్టుగా చెబుతున్న వివాహం చట్టబద్ధం కాదని తేల్చి చెప్పింది. 

విభేదాల నేపత్యంలో తమ వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ Nikhil Jain న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ, ముస్లిం అయిన వారిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింత పెళ్లి చేసుకోనందున, వారి ఏకాభిప్రాయ కలయికను వివాహంగా పరిగనించలేమని జడ్జి తెల్చి చెప్పారు. 

ఇదిలా ఉండగా, Trinamool Congress ఎంపి నుస్రత్ జహాన్ పెళ్లికి సంబంధించిన వివాదం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిమీద బిజెపి ఎంపి సంఘమిత్ర మౌర్య లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు.. ‘‘నుస్రత్ జహాన్ చట్టవిరుద్ధమైన, నైతిక ప్రవర్తన’’పై ఎథిక్స్ కమిటీతో వివరాణాత్మక దర్యాప్తు చేయించాలని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.

అంతేకాదు ఆమె సభ సభ్యత్వాన్ని "నాన్-ఎస్టేట్" గా మౌర్య అభివర్ణించారు. 2021 జూన్19న మౌర్య స్పీకర్‌కు లేఖ రాశారు. సంఘమిత్ర మౌర్య ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ నుంచి బిజెపి ఎంపిగా ఎంపికయ్యారు. ఈ లేఖతో పాటు ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి లోక్‌సభ ప్రొఫైల్‌ను కూడా అటాచ్ చేశారు. ఈ ప్రొఫైల్ లో  ఆమె తన భర్త పేరు నిఖిల్ జైన్ అని పేర్కొన్నట్టుగా ఉంది. 

నుస్రత్ జహాన్ : ‘తండ్రెవరో.. తండ్రికి తెలుసు..’ బిడ్డ గురించి అడిగినవారికి దిమ్మతిరిగే సమాధానం.. !

"లోక్ సభ నిబంధనల ప్రకారం నుస్రత్ మీద తగిన చర్యను తీసుకోవాలని, ఆమె చట్టవిరుద్ధమైన, నైతిక ప్రవర్తనకు సంబంధించిన వివరణాత్మక దర్యాప్తు కోసం ఎథిక్స్ కమిటీకి పంపాలి" అని మౌర్య లేఖలో పేర్కొన్నారు. "" ఆమె వివాహానికి సంబంధించి, మీడియాలో చేసిన ప్రకటన లోక్ సభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆమె నుస్రత్ జహాన్ రుహి జైన్ గా ప్రమాణ స్వీకారం చేయడం, రెండూ విరుద్ధంగా ఉన్నాయని, ఇది ఆమె సభ్యత్వాన్ని చట్టవిరుద్ధం అని నిరూపిస్తుంది"అని లేఖలో పేర్కొన్నారు.

జూన్ 25, 2019న తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జహాన్ తన పేరును నుస్రత్ జహాన్ రుహి జైన్ అని తెలిపారని, ఆ సమయంలో ఆమె కొత్తపెళ్లికూతురిలాగే దుస్తులు ధరించిందని మౌర్య తన లేఖలో పేర్కొన్నారు. "వాస్తవానికి, ముస్లిమేతరులను వివాహం చేసుకున్నందుకు, సిందూర్ ధరించినందుకు ఇస్లాంవాదులలో ఒక వర్గం ఆమెపై దాడి చేసినప్పుడు, పార్టీ శ్రేణుల్లోని ఎంపీలు ఆమెను సమర్థించారు. మీడియా రిపోర్టుల ప్రకారం ఆమె రిసెప్షన్‌కు సిఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు" అని బిజెపి ఎంపి రాశారు.

ఇక, West Bengal బిజెపి ఉపాధ్యక్షుడు జే ప్రకాష్ మజుందార్ ఈ నెల మొదట్లో జహాన్ పెళ్లికి సంబంధించి "పరస్పర భిన్నమైన" వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. చట్టం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని  అన్నారు. "ఇది చాలా పెద్ద విషయం అని, ఆమె పార్లమెంటు సభ్యురాలు. చట్టసభ సభ్యురాలు అయినా ఆమె నిబంధనలను పాటించడం లేదు. చట్టం దీనిమీద చర్యలు తీసుకోవాలి. పార్లమెంటు సభ్యత్వం లేఖలో కూడా ఆమె పెళ్లి అయినట్టుగా ప్రకటించింది "అని మజుందార్ చెప్పారు.

వ్యాపారవేత్త నిఖిల్ జైన్ నుండి ఆమె విడిపోవడం గురించి నుస్రత్ జహాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు, ఇందులో తన "పెళ్లి" భారత చట్టం ప్రకారం చెల్లుబాటు కానందున విడాకుల ప్రశ్న తలెత్తదని ఆమె అన్నారు. టర్కీ వివాహ నిబంధన ప్రకారం టర్కీలోని విదేశీయులను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ వివాహం చట్టబద్ధంగా చెల్లదని నుస్రత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios