Asianet News TeluguAsianet News Telugu

ఎయిమ్స్ నర్సుకు కరోనా: 40 మంది క్వారంటైన్‌కి తరలింపు

ఎయిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకు కరోనా సోకింది. దీంతో ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.
ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో పనిచేసే నర్సుకు కరోనా సోకింది. ఈ నర్సుతో కలిసి పనిచేసిన వైద్య సిబ్బందితో పాటు డాక్టర్లు కూడ క్వారంటైన్ కు వెళ్లారు.

Nurse Corona in AIIMS infected, 40 health workers approached
Author
New Delhi, First Published Apr 24, 2020, 4:28 PM IST


న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకు కరోనా సోకింది. దీంతో ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.
ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో పనిచేసే నర్సుకు కరోనా సోకింది. ఈ నర్సుతో కలిసి పనిచేసిన వైద్య సిబ్బందితో పాటు డాక్టర్లు కూడ క్వారంటైన్ కు వెళ్లారు.

ఎయిమ్స్ లో పనిచేసే 35 ఏళ్ల నర్సుకు కరోనా సోకిందని తేలింది. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంతో పాటు ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.

ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 2376 కేసులు నమోదయ్యాయి. 39 మంది పారిశుద్య సిబ్బందికి కూడ కరోనా సోకింది. దీంతో ఢిల్లీ సర్కార్ ఫ్లాస్మా థెరపీ ద్వారా రోగులకు చికిత్సను అందించాలని నిర్ణయం తీసుకొంది. 

also read:ఐదు సెకన్లలో కరోనాను గుర్తించొచ్చు: ఐఐటీ ప్రొఫెసర్ జైన్

కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడ చేరింది. దేశంలో కరోనా కేసులను చూస్తే ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల తర్వాత డిల్లీ నిలిచింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios