న్యూఢిల్లీ: ఐదు సెకన్ల వ్యవధిలో  కరోనా వైరస్ ను వ్యాధిని గుర్తించే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసినట్టుగా  ఐఐటీ-రూర్కీ ప్రోఫెసర్ కమల్ జైన్ ప్రకటించారు. కరోనా వైరస్ సోకిందనే అనుమానం ఉన్న వ్యక్తి ఎక్స్‌రే ఉపయోగించి ఐదు సెకన్లలోనే వైరస్  ఉనికిని గుర్తించే అవకాశం ఉందని చెప్పారు జైన్.

ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్ రే చిత్రాల ద్వారా సాఫ్ట్  వేర్ రోగికి న్యూమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు అదికా కరోనాకు సంబంధించిందా లేక ఇతర బాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు.

also read:ఢిల్లీలో 39 పారిశుద్య కార్మికులకు కరోనా

దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు ధరఖాస్తు చేసినట్టుగా తెలిపారు. ఆ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయడానిక 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కమల్ జైన్ పనిచేస్తున్నారు.

 కరోనా, న్యూమోనియా,క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్ రే స్కాన్ లను విశ్లేషించిన తర్వాత మొదట ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత డేటా బేస్ అభివృద్ధి చేశామన్నారు.జైన్ తయారు చేసిన ఈ సాఫ్ట్ వేర్ కు వైద్య ఆరోగ్యశాఖ నుండి ఎలాంటి ధృవీకరణ లేదు.