తంజావూరులో ఓ నర్సు రెండువారాల శిశువు బొటనవేలు కత్తిరించిన దారుణ ఘటన జరిగింది. శిశువుక అమర్చిన ఐవీ తొలగించే క్రమంలో శిశువు బొటనవేలు కత్తిరించింది. 

తమిళనాడు లోని తంజావూరులో ఈ ఘటన కలకలం రేపింది. తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని నర్సు ఈ ఘాతుకానికి పాల్పడింది. నర్సు కత్తిరించిన బొటనవేలిని అతికించడానికి సీనియర్ వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. 

ఈ ఘటన మీద శాఖాపరమైన విచారణ జరుపుతామని తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రి డీన్ డాక్టర్ జి. రవికుమార్ తెలిపారు. దీనిమీద నర్సును వివరణ ఆడగగా.. ఐవీని తొలగిస్తున్నప్పుడు శిశువు కదిలాడని, దీనివల్ల బొటనవేలు తెగిందని వైద్యులు చెబుతున్నారు. 

అయితే రెండు వారాల చిన్నారిమీద ఈ ఘాతుకానికి పాల్పడిన నర్సు మీద చర్యలు తీసుకోవాలని శిశువు తల్లిదండ్రులు కోరుతున్నారు. విచారణ నివేదిక రాగానే నర్సు నిర్లక్ష్యం అందులో వెల్లడైతే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని డీన్ తెలిపారు.