న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయపై గ్యాంగ్ రేప్ జరిగిన రోజున తాను డిల్లీలో లేనని ఆయన పిటిషన్ దాఖలు చేశాడు.

నిర్భయ కేసులో ముఖేష్ సింగ్ గురువారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు  విచారణ చేపట్టింది. ముకేష్ సింగ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్రపతి మెర్సీ పిటిషన్ ను తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ అక్షయ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.

Also read:నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

నిర్భయపై అత్యాచారం జరిగిన 2012 డిసెంబర్ 16వ తేదీన తాను ఢిల్లీలో లేనని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనందున తనకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును కోరారు.

నిర్భయ దోషులకు మార్చి 20వ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు ఉరి తీయాలని డెత్ వారంట్ జారీ చేసింది. ఉరి శిక్ష విధించడానికి కొన్ని గంటల ముందే ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.