Asianet News TeluguAsianet News Telugu

జీన్స్, టీషర్టులుతో ఆఫీసులకు రావొద్దు: సిబ్బందికి సీబీఐ చీఫ్ కొత్త డ్రెస్ కోడ్

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్ తన మార్క్ చూపిస్తున్నారు. వచ్చి రావడంతోనే సీబీఐ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తీసుకొచ్చారు. వారు వేసుకోవాల్సిన‌ దుస్తుల విష‌యంలో సుబోధ్ తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది

Nothing casual allowed CBI officials to be formally dressed ksp
Author
New Delhi, First Published Jun 4, 2021, 2:50 PM IST

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్ తన మార్క్ చూపిస్తున్నారు. వచ్చి రావడంతోనే సీబీఐ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తీసుకొచ్చారు. వారు వేసుకోవాల్సిన‌ దుస్తుల విష‌యంలో సుబోధ్ తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ ఫార్మ‌ల్ డ్రెస్ వేసుకునే రావాల‌ని, జీన్స్‌, స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వ‌స్తే సహించేది లేదని డైరెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. 

పురుషులు ఫార్మ‌ల్ చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు మాత్ర‌మే వేసుకుని విధుల‌కు రావాలని... అలాగే, క్లీన్ షేవ్‌తో ఉండాలని ఆదేశించారు. అంతేకాదు, సీబీఐలో ప‌నిచేస్తోన్న మ‌హిళాధికారులు కూడా చీర‌లు, సాధార‌ణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని మాత్ర‌మే కార్యాలయానికి రావాలని సూచించారు.

మ‌హిళా సిబ్బంది జీన్సు, టీష‌ర్టులు, స్పోర్ట్స్ షూ, చెప్పులు, ఇతర అలంక‌ర‌ణ‌లతో కార్యాల‌యాల‌కు రావ‌ద్ద‌ని సుబోధ్ ఆదేశించారు. ఈ నియ‌మ నిబంధ‌ల‌ను దేశ వ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని పేర్కొన్నారు. నిజానికి సీబీఐ అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ ఫార్మ‌ల్ డ్రెస్‌నే వేసుకోవాల్సి ఉంటుంద‌ని ఓ అధికారి మీడియాకు చెప్పారు. అయితే, చాలా ఏళ్లుగా వారు ఈ నిబంధ‌న‌ను పాటించ‌డం లేద‌ని సదరు అధికారి తెలిపారు. 

Also Read:సీబీఐ డైరెక్టర్ గా సుభోద్ జైశ్వాల్

కాగా, మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సుభోద్ కుమార్ జైశ్వాల్‌ను సీబీఐ చీఫ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురీలరతో కూడిన త్రిసభ్య కమిటీ 109 మంది జాబితా నుంచి వడపోసి జైశ్వాల్ ని ఎంపిక చేసింది.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. ఫిబ్రవరిలో రిషికుమార్ శుక్లా పదవీ విరమణ చేయడంతో... మూడు నెలలుగా సీబీఐ పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే నడుస్తోంది. 

1962 సెప్టెంబర్ 22న జైశ్వాల్ జన్మించారు. ఆక్ష్న 1985 వ ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన వారు. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం( సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో అత్యంత కీలకమైన రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లో కూడా జైశ్వాల్ కు 9 సంవత్సరాల అనుభవం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios