భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రముఖ పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియోను కలిశారు.
అమెరికా : ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో భాగంగా రేడాలియోను కలిశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సమయం వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సమయం వచ్చిన వ్యక్తి అన్నారు.
భారత సంభావ్యత అపారమైనది. రూపాంతరం చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న సంస్కర్తను కలిగి ఉన్నారు..అని భారత్ ను ఉద్దేశించి అన్నారు. భారతదేశం, ప్రధాని మోడీ చాలా అవకాశాలను సృష్టించే తరుణంలో ఉన్నారన్నారు.
ఇప్పుడు యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది - ప్రధాని మోడీ
ఇదిలాఉండగా, అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలన్ మస్క్ మాట్లాడుతూ.. తాను వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మస్క్ మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన సంభాషణ... వచ్చే ఏడాది ఇండియా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాను’ అని అన్నారు.
