Asianet News TeluguAsianet News Telugu

రెజ్లర్ నిషా దహియా మరణించలేదు.. ఆ వార్తలను ఖండిస్తూ వీడియో విడుదల

నేషనల్ రెజ్లర్ నిషా దహియా మరణించినట్టు నకిలీ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో నిషా దహియా స్వయంగా వివరణ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, ఆ వార్తలన్నీ నకిలీవని ఓ వీడియో విడుదల చేశారు.
 

not true.. wrestler nisha dahiya not died.. responds on fake news
Author
Sonipat, First Published Nov 10, 2021, 8:03 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో గతవారం కాంస్య పతకం సాధించిన రెజ్లర్ Nisha Dahiya మరణించినట్టు కొన్ని అసత్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అవాస్తవాలని, తాను సురక్షితంగా ఉన్నారని Wrestler నిషా దహియా ఓ వీడియో విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం ఉన్నట్టుండి దాదాపు అన్ని జాతీయా మీడియా సంస్థలు ఓ నకిలీ వార్త(Fake News)ను ప్రచురించాయి.

Haryanaలోని Sonipatలో హలాల్‌పూర్ ఏరియాలోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీలో ఈ రోజు నేషనల్ రెజ్లర్ నిషా దహియా, ఆమె సోదరుడు సూరజ్‌ను గుర్తు తెలియని ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారని(Shot Dead) వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ ఘటనలో ఆమె తల్లి ధన్‌పాతి తీవ్రంగా గాయపడ్డారనీ ఆ వార్తలు పేర్కొన్నాయి. నిషా దహియా తల్లి ధన్‌పాతిని రోహతక్‌లోని పీజీఐఎంఎస్‌లో చేర్చారని వివరించాయి. రెజ్లర్ నిషా దహియా, ఆమె సోదరుడు సూరజ్‌ల మృతదేహాలను సోనీపాట్‌లోని సివిల్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం కోసం తరలించినట్టు పేర్కొన్నాయి. ఈ ఘటనపై పోలీసులూ దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించాయి. ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దేశంలోని చాలా మంది వీటిపై కలత చెందారు. కానీ, ఈ వార్తలు వైరల్ కాగానే.. నిషా దహియా స్పందించారు. ఈ వార్తు అసత్యాలని కొట్టిపారేశారు. తాను సురక్షితంగా ఉన్నానని ఓ వీడియో విడుదల చేశారు.

Also Read: PM MODI: రెజ్లర్ వినేశ్ పోగట్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పీఎం మోడీ

సీనియర్ నేషనల్ రెజ్లింగ్ పోటీల కోసం తాను గోండాలో ఉన్నట్టు నిషా దహియా తెలిపారు. అవన్నీ తప్పుడు వార్తలని అన్నారు. తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలు వైరల్ కావడంతో ఆమె ఏకంగా వీడియోలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

బెల్‌గ్రేడ్‌లో జరిగిన అండర్ 23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ 2021లో నిషా దహియా 72 కేజీల వెయిట్ క్లాస్‌లో పాల్గొన్నారు. ఈ పోటీలో ఆమె భారత్‌కు కాంస్య పతకాన్ని అందించారు. ఈ రోజు ఉదయమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిషా దహియాను అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios