New Delhi: తాము ఎవరికీ భయపడటం లేదని ఛత్తీస్‌గఢ్ లో దర్యాప్తు సంస్థల దాడుల ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈడీ, సీబీఐలకు కాంగ్రెస్ భయపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలు భావించొద్దని కూడా ఆయన పేర్కొంటూ కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
Congress General Secretary KC Venugopal: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారుపై కాంగ్రెస్ మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడింది. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే తాము ఎవరికీ భయపడటం లేదని ఛత్తీస్‌గఢ్ లో దర్యాప్తు సంస్థల దాడుల ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈడీ, సీబీఐలకు కాంగ్రెస్ భయపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలు భావించొద్దని కూడా ఆయన పేర్కొంటూ విమర్శలు గుప్పించారు.
ఛత్తీస్‌గఢ్ లో పార్టీ నేతలపై పలుమార్లు దాడులు జరిగిన నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. మేము భారతీయ చట్టాలను అనుసరిస్తామని తెలిపారు. ఈడీ, సీబీఐలకు కాంగ్రెస్ భయపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అనుకోవద్దని అన్నారు. భారత చట్టాల ప్రకారమే పోరాడతామని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ దాడులు తమపై బీజేపీ ప్రయోగించిన రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేమీ కాదని, ఇందులో అసాధారణమైనదేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తాయని విమర్శించారు. భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలుసునని ఆయన అన్నారు. ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేయడం ద్వారా తమను భయపెట్టడంలో బీజేపీ విజయం సాధించదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు ముందు వారు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారో అందరూ చూస్తున్నారని తెలిపారు. తాము భయపడతామని వారు (బీజేపీ) అనుకున్నారు, కానీ ఇప్పుడు వారు అయోమయంలో పడ్డారు అని వేణుగోపాల్ అన్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరగనున్న 85వ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వేణుగోపాల్ రాయ్ పూర్ కు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భిలాయ్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, బిలాయ్గఢ్ ఎమ్మెల్యే చంద్రదేవ్ ప్రసాద్ రాయ్, రాష్ట్ర కాంగ్రెస్ కోశాధికారి, ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్ల చైర్మన్లను లక్ష్యంగా చేసుకున్న బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ లో ఈడీ ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది.
