IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Rain Alert : ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో దక్షిణాదిన వర్షాలు మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ కు కూడా వర్ష ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
IMD Rain Alert : ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇక్కడ జోరువానలు
నిన్న (జనవరి 1, గురువారం) తమిళనాడులోని నీలగిరి, తెన్కాసి, తేని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు (జనవరి 2, శుక్రవారం) కోయంబత్తూర్, తేని, తెన్కాసి, నీలగిరి సహా 4 జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటింది. రాబోయే రోజుల్లో కూడా తమిళనాడులో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని... దట్టమైన పొగమంచు కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షాలే వర్షాలు
దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీచేసింది. కోయంబత్తూర్, తేని, తెన్కాసి, నీలగిరి జిల్లాల్లోని పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ.
వర్షాలకు తోడు పొగమంచు
రేపు (శనివారం, డిసెంబర్ 3) దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని... ఉదయాన్నే కొన్నిచోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంటుందని తెలిపింది.
ఈ జిల్లాల్లో వర్షాలు
జనవరి 04 నుండి 05 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందట. డిసెంబర్ 6న కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవొచ్చని ప్రకటించింది. ఉదయాన్నే కొన్నిచోట్ల తేలికపాటి పొగమంచు ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ప్రాంతాల్లో వర్షాలు
చెన్నై, శివారు ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయాన్నే పొగమంచు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురవొచ్చని తెలిపింది. ఇక తమిళనాడు బార్డర్ లోని ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లోనూ మేఘాలు కమ్మేస్తాయని... అక్కడక్కడా వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

