రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారి జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఈసారి 40 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాల ఎన్నిక కోసం ప్రారంభించిన నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. పలు స్థానాలకు ఒకే ఒక నామినేషన్ రావడంతో వాటిని ఎన్నికల కమిషన్ ఏకగ్రీవం అయినట్టు ప్రకటించింది. ఇలా ఈ విడతలో 40 మంది సభ్యుల వరకు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. ఇందులో 11 మంది ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారు. వీరిలో అధికార బీజేపీ 8 స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ మూడు స్థానాల్లో ఏకగ్రీవం అయ్యారు. యూపీ నుంచి గెలిచిన ప్రముఖులలో కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి ఉన్నారు.
యూపీలో 2 గ్రూపుల మధ్య ఘర్షణ.. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలే కారణం..
మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కూడా ఈ సారి తమిళనాడు నుంచి తిరిగి ఎన్నికయ్యారు. గత సారి ఆయన మహారాష్ట్ర నుంచి గెలుపొందారు. వివేక్ తంఖా, రాజీవ్ శుక్లా, కాంగ్రెస్ కు చెందిన రంజీత్ రంజన్ కూడా ఈ ఏకగ్రీవం అయిన ఎంపీల్లో ఉన్నారు. బీజేపీకి చెందిన సుమిత్రా వాల్మీకి, కవిత పాటిదార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు చెందిన బల్బీర్ సింగ్ సీచేవాల్, విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మళ్లీ జమ్మూలో వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి.. ఇద్దరికి గాయాలు
ఇందులో వివేక్ తంఖా (కాంగ్రెస్), సుమిత్రా వాల్మీకి (బీజేపీ), కవితా పాటిదార్ (బీజేపీ)లు మధ్యప్రదేశ్ ఎన్నికయ్యారు. అలాగే చత్తీస్ గఢ్ నుంచి రాజీవ్ శుక్లా (కాంగ్రెస్), రంజీత్ రంజన్ (కాంగ్రెస్) గెలుపొందారు. పంజాబ్ నుంచి బల్బీర్ సింగ్ సీచేవాల్ (ఆప్), విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ (ఆప్) ఎన్నికయ్యారు. జార్ఖండ్ నుంచి మహువా మాజీ (జేఎమ్ఎమ్), ఆదిత్య సాహు (బీజేపీ)లు గెలుపొందారు.
Satyendra Nath Bose : సత్యేంద్ర నాథ్ బోస్ కు డూడుల్ తో గూగుల్ నివాళి.. ఇంతకీ ఆయన ఎవరంటే ?
మొత్తంగా రాజ్యసభలో 57 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ (4), బీహార్ (5), ఛత్తీస్గఢ్ (2), జార్ఖండ్ (2), హర్యానా (2), కర్ణాటక (4), మధ్యప్రదేశ్ (3), మహారాష్ట్ర (6), ఒడిశా (3), పంజాబ్ (2), తెలంగాణ (2), తమిళనాడు (6), ఉత్తరాఖండ్ (1), ఉత్తరప్రదేశ్ (11) నుండి ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికైనందున, మిగిలిన స్థానాలకు జూన్ 10 న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ 2 సీట్లను సులభంగా గెలుచుకుంటుందని, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో 1 స్థానాన్ని గెలుచుకోగలవని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అధికార పార్టీ 7 సీట్లు, సమాజ్వాదీ పార్టీ, కూటమి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీహార్ లో 3, కర్ణాటకలో 2, మధ్యప్రదేశ్ లో 2, రాజస్థాన్ లో 1, ఉత్తరాఖండ్ లో 1 స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది.
