మత గురువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు కిరాయి హంతకులతో కొడుకును చంపించింది ఓ తల్లి. తన కొడుకును చంపించేందుకుగాను ఆమె తన అల్లుడి సహాయం కూడ తీసుకొంది
లక్నో: మత గురువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు కిరాయి హంతకులతో కొడుకును చంపించింది ఓ తల్లి. తన కొడుకును చంపించేందుకుగాను ఆమె తన అల్లుడి సహాయం కూడ తీసుకొంది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలోని దాద్రీ శివారు లహర్లీలో ఈ ఏడాది జూన్ 18వ తేదీన ఈ ఘటన చోటు చేసుకొంది. సతీష్ కుమార్, సురేష్ దేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద వాడు అషుల్. చిన్న వాడు దీపాషు. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడ ఉంది. ఆమెకు వివాహం చేశారు. కూతురు అల్లుడు వేరే చోట నివాసం ఉంటున్నారు.
నాలుగేళ్ల క్రితం 70 ఏళ్ల కన్నయ్య అనే వ్యక్తి సురేష్ దేవికి పరిచయమయ్యాడు. తాను బాబాగా ఆమెకు పరిచయం చేసుకొన్నాడు. పూజల పేరుతో తరచూ వారి ఇంటికి వచ్చేవాడు. దీంతో సురేష్ దేవితో కన్నయ్యకు చనువు ఏర్పడింది. ఒకరోజూ ఇంటికొచ్చేసరికి కన్నయ్యతో తల్లి రాసలీలల్లో ఉండగా అషుల్ చూశాడు. వెంటనే కన్నయ్యతో సంబంధాన్ని తెంచుకోవాలని అతను తల్లిని హెచ్చరించాడు.
కన్నయ్యను ఇంటికి రాకుండా చూడాలని చెప్పాడు. అయితే కన్నయ్యతో వివాహేతర సంబంధం తెంచుకోలేని సురేష్ దేవి కన్నయ్యను హత్య చేస్తే తమ బంధానికి అడ్డు ఉండదని భావించింది. ఈ విషయాన్ని ఆమె తన అల్లుడు అమిత్ కు చెప్పింది. అల్లుడు కూడ అందుకు సరేనని చెప్పాడు.
అషుల్ ను చంపేందుకు ఓ కిరాయి హంతక ముఠాతో అమిత్ ఒప్పందం కుదుర్చుకొన్నాడు. వాషింగ్ మెషీన్ కొనుగోలు చేసేందుకని చెప్పి తన బావమరిది అషుల్ ను బైక్ పై తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లగానే అక్కడే ఎదురుచూస్తున్న హంతకముఠా కూల్‌డ్రింక్‌లో అషుల్ కు మత్తు మందు కలిపి తాగించారు. అషుల్ మత్తులోకి దిగగానే గొంతు నులిమి చంపేశారు.
అయితే కొడుకు మృతి పట్ల కూడ తల్లి సురేష్ దేవి పెద్దగా స్పందించలేదు. పోలీసుల విచారణలో కూడ ముక్తసరిగా సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఈ విషయమై లోతుగా విచారణ చేస్తే అషుల్ హత్యలో తల్లి సురేష్ దేవి పాత్ర ఉన్నట్టు తేలింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 15, 2018, 11:22 AM IST