కారులో వెళ్తున్న ఓ వ్యక్తికి అర్జెంట్ గా టాయ్ లెట్ వచ్చింది. దీంతో కారు పక్కకి ఆపి మూత్రానికి వెళ్లాడు. ఇలా రెండు నిమిషాల్లో పని కానిచ్చుకొని తిరిగి వచ్చి చూసేసరికి బీఎండబ్ల్యూ కారు మాయమైంది. ఆ రెండు నిమిషాల వ్యవధిలోనే దొంగలు కారుని చోరీ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన రిషబ్ అరోరా.. ఓ స్టాక్ బ్రేకర్. కాగా.. శనివారం రాత్రి అతను ఓ పార్టీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో ఆయన మద్యం కూడా సేవించి ఉన్నాడు. కాగా.. మద్యంలో అతనికి అర్జెంట్ గా మూత్రానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో కంట్రోల్ చేసుకోలేక రోడ్డు పక్కన కారు ఆపి.. వెళ్లాడు. తిరిి వచ్చి చూసేసరికి అతని బీఎండబ్ల్యూ కారు మాయమైంది.

Also Read డేటింగ్ యాప్ లో పరిచయం.. బలవంతంగా కారులో యువతిపై...

కాగా... ఆ కారు రిషబ్ అరోరాది కూడా కాదట. ఆయన సోదరుడిదట. దాని మీద ఇంకా రూ.40లక్షల లోన్ కూడా ఉంది. కాగా... అతను యూరిన్ కోసం కారు ఆపడాన్ని కొందరు గమనించి ఉంటారని.. ఇదే అదను అనుకొని దొంగలించి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా... అరోరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.

కారు యజమానికి తెలిసిన వ్యక్తే.. చోరీ చేసి ఉంటాడనిపోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అరోరా.. గత వారం రోజులుగా తన సోదరుడి కారును వినియోగిస్తున్నాడు.

ఎవరో ఇద్దరు వ్యక్తులు వెనకకు తిరిగి ఉన్న తనకు తుపాకీ గురి పెట్టి కారు తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నాడు. అయితే.. ఆ సమయంలో అతను విపరీతంగా తాగి ఉండటంతో... ఆయన చెప్పేదానిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.