Asianet News TeluguAsianet News Telugu

Explained: గగన్‌యాన్ మిషన్ కోసం ఒక్క మహిళా పైలట్‌నూ ఎందుకు ఎంచుకోలేదు?

గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు పైలట్లను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఇందులో నలుగురూ పురుషులే ఉన్నారు. ఒక్క మహిళా పైలట్ లేకపోవడంపై చర్చ మొదలైంది. ఇంతకీ మహిళా పైలట్‌ను ఎందుకు ఎన్నుకోలేదు? దీనికి సమాధానం ఈ ఎంపిక ప్రక్రియలోనే ఉన్నదని తెలుస్తున్నది.
 

no woman pilot selected for gaganyaan mission, explained here why kms
Author
First Published Feb 27, 2024, 6:45 PM IST | Last Updated Feb 27, 2024, 6:45 PM IST

Gaganyaan Mission: మానవ సహిత గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్ పైలట్లను ఎంచుకున్నారు. ఈ నలుగురు పైలట్ల పేర్లను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి అభినందనలు తెలిపారు. ఆ వెంటనే ఆయన మహిళా శాస్త్రవేత్తల గురించి మాట్లాడారు. మన దేశం చేస్తున్న అంతరిక్ష ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. వారి కృషి లేకుండా చంద్రయాన్ లేదా గగన్‌యాన్ మిషన్ వాస్తవరూపం దాల్చేవి కావని వివరించారు.

మానవ సహిత ఈ గగన్ యాన్ మిషన్‌ కోసం నలుగురు పైలట్లు ఎంపికయ్యారు. కెప్టెన్లు ప్రశాంత్ బాలక్రిష్ణన్ నాయర్, అజిత్ క్రిష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంషు శుక్లాలు గగన్ యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లుతారు. అయితే.. ఇందులో మహిళా పైలట్ లేకపోవడంపై చర్చ జరుగుతున్నది. నలుగురిలో ఒక్క మహిళా పైలట్ అయినా ఉండాలి కదా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే మన దేశానికి లేదా మన దేశ మూలాలు గల మహిళలు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌లు అంతరిక్షంలోకి వెళ్లారు. వీరు కొన్ని తరాలను ఇన్‌స్పైర్ చేశారు.

మరి గగన్ యాన్ మిషన్ కింద వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లాల్సిన నలుగురు పైలట్లలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరు? దీనికి సమాధానం ఈ నలుగురిని ఎంచుకునే ప్రక్రియలోనే ఉన్నదని తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా రోదసిలోకి మనిషి పంపే సమయంలో టెస్ట్ పైలట్ల పూల్ నుంచి ఎన్నుకుంటారు. ఇక మన దేశ విషయానికి వస్తే ఇండియాలో మహిళా టెస్టు పైలట్లు లేరు. అందుకే ఎన్నుకునే అతికొద్ది టెస్టు పైలట్ల జాబితాలో మహిళలు లేకపోవడంతో తుది ఎంపికలో వారు లేరు. 

Also Read: Medaram Jathara: మేడారం జాతరలో ఎన్ని హుండీలు నిండాయి? అవి ఎవరికి చెందుతాయి?

ఇంతకీ టెస్టు పైలట్లను ఎలా ఎన్నుకుంటారు? ఏవియేషన్‌లో అపారమైన అనుభవంతోపాటు కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు కలవారిని టెస్టు పైలట్లుగా ఎంచుకుంటారు. ఇందులో సాధారణంగా ఎక్కువగా మౌనంగా ఉండేవారిని, ఆపత్కాలంలోనూ గందరగోళపడకుండా ఎక్కువగా సైలెంట్‌గా ఉండేవారిని ఎన్నుకుంటూ ఉంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios