జీవించే కోరిక లేదు: మృతికి ముందు థరూర్ కు సునంద మెయిల్

First Published 28, May 2018, 5:02 PM IST
No Wish To Live, Sunanda Pushkar Mailed Shashi Tharoor Before Death
Highlights

జీవించాలనే కోరిక నశించిందని సునంద పుష్కర్ తన భర్త శశి థరూర్ కు ఓ లేఖను మెయిల్ చేసింది.

న్యూఢిల్లీ: జీవించాలనే కోరిక నశించిందని సునంద పుష్కర్ తన భర్త శశి థరూర్ కు ఓ లేఖను మెయిల్ చేసింది. తన మరణానికి వారం రోజుల ముందు ఆ లేఖను మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఢిల్లీ కోర్టుకు పోలీసులు సోమవారంనాడు ఆ విషయం చెప్పారు. శశి థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపిస్తూ పోలీసులు 3 వేల పేజీల చార్జిషీట్ ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 

సోషల్ మీడియాలో పోస్టులను, మెయిల్స్ ను సునంద పుష్కర్ మరణ వాంగ్మూలంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శశిథరూర్ కు సమన్లు జారీ చేయాలా, వద్దా అనే విషయంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

నాకు జీవించాలనే కోరిక.. నా మరణానికి అందరూ ప్రార్థించండి అని సునంద జనవరి 8వ తేదీన, తన మరణానికి 9 రోజుల ముందు లేఖ రాసి మెయిల్ చేసింది. 

విషం స్వీకరించడం వల్లనే సునంద పుష్కర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె గదిలో దాదాపు 27 అల్ప్రాక్ష్ మాత్రలు లభించాయని. అయితే, ఆమె ఎన్ని మింగిందనేది తేలలేదు. 

సునంద పుష్కర్ డిప్రెషన్ లోకి జారుకుంటున్నా, ఆల్ప్రాక్ష్ మాత్రలు కలిగి ఉన్నా భర్తగా శశిథరూర్ పట్టించుకోలేదని చార్జిషీట్ లో పోలీసులు ఆరోపించారు. వారిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవని అన్నారు. గాయాలు తీవ్రమైనవి కాకపోయినా వారిద్దరు తరుచు గొడవ పడినట్లు మాత్రం తెలియజేస్తున్నాయని అన్నారు. 

loader