Asianet News TeluguAsianet News Telugu

పెగాసెస్‌: రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన

పెగాసెస్ సాఫ్ట్‌వేర్ తయారు చేసే సంస్థతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ తెలిపారు. సోమవారం నాడు రాజ్యసభలో సీపీఎం ఎంపీ అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా రక్షణశాఖ సహాయమంత్రి సమాధానమిచ్చారు.

No Transaction With Pegasus Maker: Defence Ministry To Parliament lns
Author
New Delhi, First Published Aug 9, 2021, 7:56 PM IST


 న్యూఢిల్లీ: పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్ విక్రయించే ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని కేంద్ర రక్షణశాఖ ప్రకటించారు.సోమవారం నాడు రాజ్యసభలో  కేంద్ర రక్షణశాఖ  రాజ్యసభలో ప్రకటన చేసింది.ఎన్ఎస్ఓ గ్రూప్  టెక్నాలజీ సంస్థతో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలున్నాయా అని సీపీఎం ఎంపీ డి.శివదాసన్ ప్రశ్నించారు.

also read:ఆ నివేదికలు సరైనవే అయితే తీవ్రవైనవే: పెగాసెస్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం

రక్షణశాఖ మంత్రిత్వశాఖ ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదని రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు.అక్రమంగా ఇప్పటివరకు ప్రభుత్వం  ఎవరిపై కూడ నిఘా పెట్టలేదని రక్షణశాఖ మంత్రి తేల్చి చెప్పారు.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి రోజుల ముందే పెగాసెస్ సాఫ్ట్‌వేర్ సహయంతో దేశంలోని విపక్ష పార్టీలతో పాటు జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లను హ్యాకింగ్ చేశారని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఈ విషయమై చర్చకు పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయమై ప్రధానితో పాటు మంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios