రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. సోమవారం ఆయన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలిశారు. అనంతరం మీడియాాతో మాట్లాడారు.
తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని సినీ నటుడు రజినీకాంత్ అన్నారు. సోమవారం ఆయన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే వారి మధ్య సంభాషణకు సంబంధించిన ఎక్కువ వివరాలను వెల్లడించలేదు. మీరు రాజకీయాల్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా అని మీడియా ప్రశ్నించినప్పుడు దానిని ఆయన ప్రతికూలమైన సమాధానం ఇచ్చారు.
ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నాను.. మనం శత్రువులం కాదు: రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు ప్రసంగం..
ఈ సందర్భంగా మీడియాతో రజనీకాంత్ మాట్లాడుతూ.. గవర్నర్ తన జీవితమంతా ఉత్తర భారతదేశంలోనే ఉన్నారని చెప్పారు. అయితే ఆయనకు అంటే ఇష్టమని తెలిపారు. ‘‘ తమిళనాడు ప్రజల చిత్తశుద్ధి, కృషి, నిజాయితీ ఆయనకు చాలా ఇష్టం. తమిళనాడు సంక్షేమం కోసం ఆయన దేనికైనా సిద్ధమని నాతో చెప్పారు ’’ అని రజనీకాంత్ అన్నారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రజనీకాంత్ రాజకీయాల్లో కొంత కాలం పని చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు వెనక్కి తగ్గారు. 2017 డిసెంబర్ లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. సొంతంగా ‘రజినీ మక్కల్ మండ్రం’ అనే పార్టీని ప్రారంభించారు.
అనేక సంగ్ధిదాల అనంతరం ప్రారంభమైన పార్టీ 2020 డిసెంబర్ తరువాత ఆయన అనారోగ్య కారణాలు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రజనీకాంత్ ఎన్నికల రణరంగం నుంచి వైదొలిగారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించగానే రాష్ట్ర రాజకీయాలను ఆయన షేక్ చేస్తారని చాలా మంది భావించారు. 1967 నుండి డీఎంకే, ఏఐఏడీఎంకేల పాలనలో ఉన్న తమిళనాడులో పట్టు సాధించడానికి బీజేపీ ఆయనను ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నించింది.
