Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నాను.. మనం శత్రువులం కాదు: రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు ప్రసంగం..

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో యుగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వెంకయ్యా నాయుడు.. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హోదాలో తన చివరి ప్రసంగం చేశారు. 

My wish is that Parliament functions well says venkaiah naidu in farewell speech
Author
First Published Aug 8, 2022, 4:19 PM IST

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో యుగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వెంకయ్యా నాయుడు.. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హోదాలో తన చివరి ప్రసంగం చేశారు. ఎంపీలు సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తోందని.. ఎగువ సభ మరింత గొప్ప బాధ్యతను కలిగి ఉందని అన్నారు. కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. 

సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాక్షించారు. సభ గౌరవాన్ని కాపాడుకోవాలని రాజ్యసభ ఎంపీలకు వెంకయ్య విజ్ఞప్తి చేశారు. ‘‘సభ నిర్వహణకు నా వంతు కృషి చేశాను. నేను దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమం, ఈశాన్యం.. అన్ని వైపుల వారికి అవకాశం కల్పించడానికి ప్రయత్నించాను. మీలో ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వడింది’’ అని వెంకయ్య నాయుడు అన్నారు. 

అలాగే ఉప రాష్ట్రపతి పదవి ఎంపికవుతున్నాని ప్రధాని మోదీ తనకు చెప్పినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తుచేసుకున్నారు. ‘‘నేను భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికవుతున్నానని ప్రధాని చెప్పిన రోజు.. నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. దాని గురించి నేను అడగలేదు. పార్టీ ఆదేశాన్ని ఇచ్చింది.. నేను బాధ్యత వహించి పార్టీకి రాజీనామా చేశాను. నేను పార్టీని వీడాల్సి వచ్చినందుకు కన్నీళ్లు వచ్చాయి’’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

‘‘మనం శత్రువులం కాదు.. ప్రత్యర్థులం. పోటీలో ఇతరులను మించిపోవడానికి మనం కష్టపడి పని చేయాలి.. కానీ ఇతరులను తగ్గించకూడదు. పార్లమెంటు సజావుగా సాగాలని నా కోరిక... మీ ప్రేమ, ఆప్యాయతలకు నేను చలించాను. నేను కృతజ్ఞతలు తెలపుతున్నాను’’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios