Asianet News Telugu

రాహుల్ రాజీనామాపై చర్చోపచర్చలు: మోడీకి ధీటైన నేత ఎక్కడ?

ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న ఒక మాట.. రాహుల్ రాజీనామా చేయాలి. కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన 1/10వ వంతు సీట్లను కూడా కైవసం చేసుకోలేకపోగా, తన సొంత సీటు గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ సీటును కూడా కోల్పోవడంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

No other leader is not able to fight against Modi
Author
Hyderabad, First Published May 25, 2019, 8:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న ఒక మాట.. రాహుల్ రాజీనామా చేయాలి. కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన 1/10వ వంతు సీట్లను కూడా కైవసం చేసుకోలేకపోగా, తన సొంత సీటు గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ సీటును కూడా కోల్పోవడంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది.

స్మృతి ఇరానీ కనుక అమేథీలో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానాని చెప్పిన మాటను కూడా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. రాజీనామా డిమాండ్ ను అటుంచితే 2014 రాహుల్ కు, ఇప్పటి రాహుల్ అప్ గ్రేడ్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. తను ఎంతో మెరుగ్గా తయారయ్యాడు. అప్పట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడే రాహుల్ ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రతి ప్రశ్నకు అలవోకగా, తెలివిగా సమాధానాలిస్తుంటాడు. 

అంతే కాకుండా పార్లమెంట్ లో సైతం రాఫెల్ యుద్ధ విమానాలపై మాట్లాడినప్పుడు ఒకింత సభికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రధానమంత్రిని పార్లమెంట్ సభలో ఆలింగనం చేసుకున్నప్పుడు ఒకింత అగ్రెసివ్ గా కూడా కనపడ్డారు. మొత్తానికి రాహుల్ 2.0 మాత్రం తన శక్తిమేర కష్టపడ్డాడని చెప్పవచ్చు. 

కొద్దిసేపు రాహుల్ ని పక్కనుంచి పశ్చిమ బెంగాల్ వైపు వస్తే.. భారత దేశం మొత్తంలో మోడీని డీ అంటే డీ అనే సత్తా ఉన్న ఏకైక లీడర్ మమతా బెనర్జీ. తను తన కిల్లర్ ఇన్ స్టింక్ట్ తో మోడీ - షాల ద్వయాన్ని సైతం డిఫెన్స్ లో నెట్టగలిగింది. అంతటి గట్టి నాయకురాలు మమతా ఇలాఖాలోనే దాదాపుగా 50శాతానికి దగ్గాగా సీట్లను బీజేపీ తెచ్చుకోగలిగింది. 

అదే అక్కడ దీదీ కాకుండా ఇంకెవరైనా ఉంటే, బీజేపీ ఆ రాష్ట్రాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసేది. అలాంటి మమతా బెనర్జీకి సైతం తమ అస్త్ర శాస్త్రాల ద్వారా కాళ్లక్రిందకి నీటిని తెప్పించారంటే రాహుల్ గాంధీ దానికి అతీతుడు కాదు. అలా అని రాహుల్ చేసింది కరెక్టా? అతను బాధ్యత వహించకూడదా? అంటే ఖచ్చితంగా అతనే బాధ్యత వహించాలి. ఇంకో మాటకొస్తే కాంగ్రెస్ లో ఎవరుకూడా బిజెపిని ఎదుర్కోలేకపోయేవారు. 

రాహుల్ గాంధీ 2017 శీతాకాలంలో గుజరాత్ ఎన్నికలో దాదాపుగా బీజేపీని ఓడించినంత పని చేశాడు. 2018లో జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాడు. 

మొత్తానికి అధ్యక్షున్ని మార్చాలా వద్దా అనే దాని కన్నా ఇప్పటికైనా జనాకర్షణను ఎలా సాధించాలనే దానిపై ద్రుష్టి పెడితే మేలు. 

Follow Us:
Download App:
  • android
  • ios