Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్రను ఎవ్వరూ ఆపలేరు.. అది శ్రీనగర్‌లోనే ముగుస్తుంది - రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం రాత్రి తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నాందేడ్ జిల్లాలోని దెగ్గూర్ లో పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు.

No one can stop Bharat Jodo Yatra.. It ends in Srinagar itself - Rahul Gandhi
Author
First Published Nov 8, 2022, 3:13 AM IST

భారత్ జోడో యాత్రను ఎవ్వరూ ఆపలేరని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రణాళిక ప్రకారం యాత్ర  శ్రీనగర్‌లో ముగుస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు నెలల కిందట ప్రారంభమైన ఈ పాదయాత్ర సోమవారం రాత్రి తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. 

మహారాష్ట్రలోని దెగ్లూర్ వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. “యాత్ర లక్ష్యం భారతదేశాన్ని (ప్రజలను) కనెక్ట్ చేయడం. దేశంలో నాటిన విభజన, ద్వేషానికి వ్యతిరేకంగా స్వరాన్ని పెంచడం. ’’ అని అన్నారు. ఈ భారత్ జోడో యాత్రను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర శ్రీనగర్‌లో మాత్రమే ఆగుతుందని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ కు షాక్.. పార్టీ ట్విట్టర్ అకౌంట్లను తక్షణమే బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశాలు.. ఎందుకంటే ?

రైతులు, కార్మికులు, సీనియర్ సిటిజన్లు, యువత, వ్యాపారులు ఎవ్వరి కోసమైనా తమ తలుపులు, హృదయాలు తెరిచే ఉంటాయని రాహుల్ గాంధీ అన్నారు. తాము మహారాష్ట్ర గొంతు, బాధను వినాలనుకుంటున్నామని చెప్పారు. భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, దేశాన్ని పీడిస్తున్న అనర్థాలకు ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు వంటి విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.

నోట్ల రద్దు వంటి ప్రదాని నిర్ణయాల వల్ల అప్పటికే నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న ప్రజల వెన్నుపాము విరిగిపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతకు ముందు ప్రధానమంత్రి డీజిల్, పెట్రోల్ గురించి మాట్లాడేవారనీ, కాని ఇప్పుడు ఇంధన ధరలు అత్యధిక గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడటం లేదని అన్నారు. 

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి.. 25 మందికి గాయాలు

కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పాత రోజులను తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి  భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పాదయాత్ర పూర్తి చేసుకుంది. అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించింది. అయితే దీపావళి పండగ, కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారోత్సం సందర్భంగా అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. అక్టోబర్ 27న రాహుల్ పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. నవంబర్ 4వ తేదీన పాదయాత్రలో సాధారణ విరామం తీసుకున్నారు.

తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల పాటు సాగిన రాహుల్ పాదయాత్ర సోమవారంతో ముగిసింది. 3,570 కిలోమీటర్ల పాటు సాగే ఈ సుదీర్ఘ భారత్ జోడో యాత్ర.. 61వ రోజున తెలంగాణ నుంచి మహారాష్ట్ర నాందేండ్ జిల్లాలోని దెగ్లూర్‌కు చేరుకుంది. ఇక్కడ రెండు బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios