Woman lets lover rape daughter: తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ప్రియుడిని అనుమతించినందుకు చెన్నై పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. బాలిక గర్భం దాల్చడంతో  ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. 

Tamil Nadu: త‌మిళ‌నాడులో దారుణం ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ మ‌హిళ త‌న ల‌వ‌ర్ తో సొంత మైన‌ర్ కుమార్తెపై అత్యాచారం చేయించింది. స‌ద‌రు బాలిక గ‌ర్భం దాల్చింది. ఇంట్లో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే, పసికందు అస్వస్థతకు గురికావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఘటన వెలుగులోకి వచ్చింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు.. స‌ద‌రు మహిళ‌తో పాటు ఆమె ప్ర‌యుడిపైనా కేసు న‌మోదుచేశారు. ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రియుడే అనుమతించి.. ఆ తర్వాత ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వ‌డానికి కార‌ణ‌మైన ఓ మహిళను, ఆమె ప్ర‌యుడిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11వ తరగతి చదువుతున్న బాలిక గర్భవతి కావడంతో గతేడాది చదువు మానేసింది. ఆమె తల్లి ఒక వితంతువు.. రోజువారీ కూలీగా పని చేస్తుంది. ఆ మహిళకు 50 ఏళ్ల వ్యక్తితో అక్ర‌మ‌ సంబంధం ఏర్పడింది. ఈ క్ర‌మంలోనే బాధిత బాలిక‌ను చూసిన ఆ వ్య‌క్తి.. పెళ్లి చేసుకోవాలనే కోరికను బయటపెట్టాడు. అయితే, బాలిక నిరాక‌రిస్తుంద‌నే కార‌ణంతో అత‌నితో బాలిక‌పై అత్యాచారం చేయ‌డానికి స‌హ‌క‌రించింది. బాలిక‌పై కొంతకాలంగా అత్యాచారం చేశాడు. గర్భవతి అయిన వెంటనే, తల్లి ఆ వ్యక్తితో అమ్మాయిని వివాహం చేసింది. బాలిక గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో చ‌దువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. అయితే, ఈ విష‌యం గురించి ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా ఆ మహిళ.. గ‌ర్భ‌వ‌తి అయిన మైన‌ర్ కుమార్తెను బ‌య‌ట‌కు రాకుండా ఇంట్లోనే బంధించి.. మందులు అందించింది.

ఈ క్ర‌మంలోనే మే 1న, బాలిక ప్రసవ నొప్పి గురించి త‌న త‌ల్లికి తెలిపింది. బాత్‌రూమ్‌లో బిడ్డను ప్రసవించడంలో మహిళ సహాయం చేసింది అని త‌మ విచార‌ణ‌లో గుర్తించామ‌ని ఓ పోలీసులు అధికారి వెల్ల‌డించారు. అయితే, 13 రోజుల పాప అస్వస్థతకు గురికావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ల‌గా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్రంలోని సిబ్బంది బిడ్డ తల్లి, బిడ్డ పుట్టిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళ తన ఆధార్ కార్డును కేంద్రంలో సమర్పించగా వారు బాలిక వయస్సును గుర్తించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ( సీడబ్ల్యూసీ)కి సమాచారం అందించారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిక‌ట్టిన మ‌హిళ‌, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలావుండగా, రాంచీ (ranchi) నగరంలో బాలిక ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఐదుగురు దుండగులు కారులో ఆమెను అనుసరించారు. కొద్ది దూరం వెళ్లాక అడ్రస్​ చెప్పాలంటూ ఆమెను కోరారు... అనంతరం కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. రాతూ స్టేషన్​ సమీపంలోని ఓ రెస్టారెంట్​ సమీపంలో కారులోనే అగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే రాత్రి పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న డీఎస్​పీ అంకిత (dsp ankitha) .. అనుమానాస్పదంగా ఉన్న కారును గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి కారును తనిఖీ చేశారు. అందులో ఐదుగురు యువకులు అభ్యంతకర రీతిలో కనిపించటం, వారి మధ్యలో బాలిక ఏడుస్తూ ఉండటాన్ని గమనించారు. దీంతో విషయం అర్ధం చేసుకున్న అంకిత.. వెంటనే ధుర్వ స్టేషన్​ ఇంఛార్జ్​ ప్రవీణ్ ఝాకు ఫోన్​ చేసి అదనపు బలగాలను పంపించాలని ఆదేశించారు. డీఎస్పీ ఆదేశంతో అక్కడికి చేరుకున్న పోలీసు బలగాలు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో ఐదుగురు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితుల్లో పలువురు వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులుగా గుర్తించామన్నారు.