మందుబాబులకు కేంద్రం షాక్: ఆ ఒక్కటీ అడగొద్దంటోన్న మోడీ సర్కార్

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అందరి బాధా ఒకటైతే మందుబాబుల గొడవ మరోకటి. ప్రతిరోజూ చుక్క పడితే కానీ నిద్రపోని వారికి లాక్‌డౌన్ శరఘాతంలా తగిలింది.

no liquor to be sold after april 20 says Union government

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అందరి బాధా ఒకటైతే మందుబాబుల గొడవ మరోకటి. ప్రతిరోజూ చుక్క పడితే కానీ నిద్రపోని వారికి లాక్‌డౌన్ శరఘాతంలా తగిలింది.

తాగేందుకు మద్యం లేకపోవడంతో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు కొందరైతే.. వింత వింతగా ప్రవర్తిస్తున వారు మరికొందరు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఈ నెల 20 వ తేదీ నుంచి సడలింపులు ఉంటాయని, మద్యం దొరుకుతుందోమోనని మందుబాబులు ఆశపడుతున్నారు.

Also Read:ఇండియాలో 13 వేలు దాటిన కరోనా కేసులు: మరణాల సంఖ్య 449

ఇలాంటి వారి ఆశలకు మోడీ సర్కార్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు సడలింపులు ఇవ్వబోమని, వైన్ షాపులు ఎట్టి పరిస్ధితుల్లోనూ తెరచుకోవని కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తామని మోడీ ప్రకటించారు. అయితే ఈ లిస్టులో మద్యం దుకాణాలు లేవని వెల్లడించారు.

మద్యం రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది.. అందుకే ఈ రంగానికి ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ మార్గదర్శకాలు ఇచ్చామని.. అయితే కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని ఆన్‌లైన్‌లో అమ్మాలని చూస్తున్నాయన్నారు.

వీటిపై తుది నిర్ణయం రాష్ట్రాలదేనని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్రీన్ జోన్లలో ఆంక్షలను తొలగిస్తున్నట్లు చెప్పిన మంత్రి.. కొన్ని దుకాణాలు, నిర్మాణ పనులు వంటివి చేసుకోవడానికి సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:ఈ నెల 20 తర్వాత సరి-బేసి విధానంలో రోడ్లపైకి వాహనాలు:కేరళ సీఎం విజయన్

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 24 గంటలు అన్ని రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై ఆయన ఫైరయ్యారు.

దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,500కు చేరుకుంది. మరణాలు 449కి చేరుకున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios