Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 20 తర్వాత సరి-బేసి విధానంలో రోడ్లపైకి వాహనాలు:కేరళ సీఎం విజయన్

ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో  సరి-బేసి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్టు  కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

Kerala to implement 'odd-even' for vehicles after April 20 : CM Vijayan
Author
Kerala, First Published Apr 17, 2020, 1:41 PM IST

తిరువనంతపురం: ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో  సరి-బేసి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్టు  కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

మహిళలు నడిపే వాహనాలను మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టుగా కేరళ సీఎం ప్రకటించారు. అంతేకాదు ఈ వాహనాలకు రాయితీ కూడ ఇస్తామన్నారు. కరోనా ప్రభావం ఉన్న జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించేందుకు కేంద్రం అనుమతి కోరినట్టుగా విజయన్ చెప్పారు. 

రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాసర్ గోడ్, కన్నూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను ఒక జోన్ గా పరిగణిస్తూ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని  కేరళ సీఎం ప్రకటించారు.

also read:తెలంగాణ భేష్: ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ముఖ్యాంశాలు ఇవీ

పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలు  రెండో జోన్ లో ఉంటాయని సీఎం తెలిపారు. ఈ జిల్లాల్లో హాట్ స్పాట్స్ జోన్లను సీజ్ చేస్తామన్నారు. అదే విధంగా అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్ , త్రిసూర్ , వయనాడ్ జిల్లాలను మూడో జోన్ గా పరిగణిస్తూ లాక్ డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించనున్నట్టుగా ఆయన తెలిపారు.

ఇక రాష్ట్రంలోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని విజయన్ చెప్పారు. ఈ జిల్లాలు నాలుగో జోన్ కిందకు వస్తాయన్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 394 కరోనా కేసులు నమోదయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios