భర్తకు కూరగాయాలు తెమ్మని భార్య లిస్ట్.. నెట్టింట వైరల్..!
ఆ లిస్ట్ లో ఆమె కూరగాయాలు రాయడమే కాదు, దానిలో స్పెసిఫికేషన్స్ కూడా ఉండటం విశేషం. ఆమె రాసిన స్పెసిఫికేషన్స్ చూస్తుంటే, ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

భార్యభర్తల మధ్య చిన్న, పెద్ద గొడవలు జరుగుతుండటం చాలా సహజం. అసలు ఆ గొడవలు కూడా లేకపోతే దాంపత్య జీవితం బోర్ గా మారుతుంది. అయితే, ఎక్కువగా గొడవలు ఎక్కడ మొదలౌతాయంటే, భార్య చెప్పినది భర్త తేని సమయంలోనే. ఇంట్లో భార్య ఒకటి తెమ్మంటే, భర్త మరోటి తీసుకువస్తూ ఉంటాడు. లేదంటే, తేవడమే మర్చిపోతూ ఉంటాడు.
దీని వల్ల వారి మధ్య గొడవలు పెరుగుతూ ఉంటాయి. తాజాగా, దంపతులకు సంబంధించిన ఓ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్టులో ఓ మహిళ తన భర్తకు కూరగాయాలు తీసుకురమ్మని ఓ లిస్ట్ తయారు చేసింది. ఆ లిస్ట్ లో ఆమె కూరగాయాలు రాయడమే కాదు, దానిలో స్పెసిఫికేషన్స్ కూడా ఉండటం విశేషం. ఆమె రాసిన స్పెసిఫికేషన్స్ చూస్తుంటే, ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
ఎందుకంటే, టమాటలు ఎంత కొనాలి, ఎలాంటివి కొనాలి, పుచ్చులు లేనివి తేవాలి అని ఆమె రాయడం విశేషం. ఉల్లిపాయలు సైతం చిన్నవి, పెద్దవి గుండ్రంగా ఉన్నవి ఇలా ఎలాంటివి ఎంచుకోవాలో కూడా క్లియర్ గా రాసింది. ఆమె అందులో వాటి బొమ్మలు కూడా గీయడం విశేషం పాలకూర, బంగాళ దుంపలు, మిరపకాయలు ఇలా ఏవేవి తేవాలో, ఎంత తేవాలో అంందులో పేర్కొంది. అంతేకాదు, కూరగాయలు తీసుకున్న తర్వాత ఆ చీటిని మళ్లీ ఇంటికి తీసుకురమ్మని చివరల్లో రాయడం గమనార్హం.
ఆ కూరగాయలు రాసిన పేపర్ ని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆమె అలా అంత వివరంగా రాయడంతో నెటిజన్లు స్పందించకుండా ఉండలేకపోతున్నారు.