భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర పెట్టలేదని ఓ వ్యక్తి ప్రాణ స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని మంకాపూర్‎కు చెందిన బనార్సీ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఫ్రెండ్ గౌరవ్ గైక్వాడ్‎ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. భోజనానికి పిలిచి తనకు కోడిగుడ్డు కూర పెట్టలేదని స్నేహితుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త వివాదానికి దారి తీసింది.

 ఈ క్రమంలో గౌరవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఇనుపరాడ్డుతో బనార్సీ తలపై కొట్టాడు. దీంతో బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుడు గౌరవ్‎ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.