మోడీ సర్కార్ పై అవిశ్వాస చర్చలో ప్రసంగాన్ని ముగించుకొని రాహుల్ గాంధీ లోక్ సభ నుండి బయటకు వెళ్లారు. రాజస్థాన్ లో ఆదీవాసీల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చలో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ నుండి వెళ్లిపోయారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.అవిశ్వాసంపై బుధవారంనాడు లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్రలో తన అనుభవాలను ప్రస్తావించారు. మణిపూర్ హింసపై ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.రాహుల్ గాంధీని రావణుడితో పోల్చారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులకు, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు. తన ప్రసంగాన్ని ముగించుకొని రాహుల్ గాంధీ రాజస్థాన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.ఈ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. వాళ్లు పారిపోయారు, కానీ మేం పారిపోలేదని రాహుల్ గాంధీ లోక్ సభ నుండి వెళ్లిపోవడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.
