Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఉచ్చులో పడొద్దని బాబుకు చెప్పా: మోడీ


: టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై లో‌క్‌సభలో సుమారు పది గంటలకు పైగా  శుక్రవారం నాడు చర్చ జరిగింది.ఈ చర్చలో పలు పార్టీల సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రధాని మోడీ సమాధానమిచ్చారు.
 

no confidence motion: Narendra modi replies to the debate


న్యూఢిల్లీ: టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై లో‌క్‌సభలో సుమారు పది గంటలకు పైగా  శుక్రవారం నాడు చర్చ జరిగింది.ఈ చర్చలో పలు పార్టీల సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రధాని మోడీ సమాధానమిచ్చారు.

 *అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది

*తలుపులు మూసి రాష్ట్ర విభజనచేశారన్న కేశినేని నాని

*అశాస్త్రీయంగా రాష్ట్ర విబజనించారన్న కేశినేని నాని

*కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర విబజనకు కారణమన్న కేశినేని నాని

*మోడీలో గొప్పనటుడు ఉన్నాడన్న కేశినేని నాని

*2014లో కూడ మోడీ ఇలానే నటించారన్న కేశినేని నాని

*నాని మాటలకు బీజేపీ ఎంపీల అభ్యంతరం

*ప్రధానిలో గొప్ప నటుడు ఉన్నాడని చెప్పిన నాని

*మోడీ గంటన్నర పాటు డ్రామా నడిపారన్న కేశినేని నాని

* ప్రధాని ప్రసంగం తర్వాత టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రసంగించారు.

*అందరిని సమానంగా చూస్తున్నామన్న మోడీ

*స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన

*సాగర్ మాల, భారత్ మాల పేరుతో దేశంలోని రోడ్లను అనుసంధానం చేసినట్టు చెప్పిన మోడీ

*పైటర్ జెట్స్‌లో మహిళలను నియమించినట్టు ప్రకటించిన మోడీ

*4 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించిన మోడీ

*2014లో ఎన్డీఏ ప్రభుత్వం రాకపోతే బ్యాంకింగ్ సంక్షోభం వచ్చేదన్న మోడీ

*బ్యాంకింగ్ రంగాన్ని తమ ప్రభుత్వం ప్రక్షాళన చేసిందన్న మోడీ

* బ్యాంకుల నుండి కాంగ్రెస్ కోట్లాది రూపాయాలను దోచుకొందన్న మోడీ

*2009లో ఎన్నికలు వస్తున్నాయని 2008 నుండే బ్యాంకులను దోచుకోవడం కాంగ్రెస్ ప్రారంభించిందన్న మోడీ

*వాజ్‌పేయ్ హయాంలో ఏర్పాటైన మూడు రాష్ట్రాలు ప్రస్తుతం ప్రగతిపథంలో ఉన్నాయన్న మోడీ

*విభజన అంశాల విషయంలో టీఆర్ఎస్ హుందాగా వ్యవహరించిందన్న మోడీ

*రెండు రాష్ట్రాలకు లోటు రానీయమని చెప్పిన మోడీ

*ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపకాల వివాదం సాగుతోందన్న మోడీ

*ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తామన్న మోడీ

*టీడీపీ ఎంపీల నినాదాలు

*గుజరాత్ సీఎంగా ఉన్పప్పుడు జీఎస్టీపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారన్న మోడీ

*పోటీలు పడీ సభను వాడుకొంటున్నారు,

*ఆంధ్రా అభివృద్దే దేశాభివృద్దిగా ప్రకటించిన మోడీ

*ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఆర్థికమంత్రిని బాబు ప్రశంసించారన్న మోడీ

*మీ గొడవల్లో నన్ను వాడుకోవద్దని బాబు చెప్పా

*14వ, ఆర్థిక సంఘం సిఫారసులు మా చేతులను కట్టేసిందన్న మోడీ

*ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతోంది

*ప్రత్యేక హోదా లేదన్న మోడీ...ప్రత్యేక ప్యాకేజీకే కట్టుబడి ఉన్నామన్న మోడీ

*నేను బాబుకు ఫోన్ చేశాను... నీవు వైసీపీ ఉచ్చులో చిక్కుకొంటున్నావని చెప్పాను

*తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు బాబు యూ టర్న్ తీసుకొన్నారు.

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని బాబు చెప్పారు

*తెలుగు తల్లి స్పూర్తిని కాపాడాలని ఇప్పుడు కూడ అంటున్నా

*బీజేపీ గతంలో రాష్ట్రాలను విభజించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.

*కాంగ్రెస్ బలహీనపడింది, వారితో జత కట్టేవారు కూడ మునిగిపోతారు

*తలుపులు మూసీ ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించారన్న మోడీ

*దేశంలో హింసను రెచ్చగొట్టే కుట్ర సాగుతోందన్న మోడీ

*ప్రజలు, రైతులు, యువత ఆకాంక్షలను నెరవేరుస్తానన్న మోడీ

 *  ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం కాంగ్రెస్ కు అలవాటేనన్న మోడీ
*దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పై మోడీ విమర్శలు

*ఎవరినీ కూడ వదలిపెట్టమన్నారు. అందరీకీ సమాధానం చెబుతామన్న మోడీ

*పెట్రోల్ రేట్లు నిర్ణయించే నిర్ణయాన్ని పెట్రోల్ కంపెనీలకు యూపీయే తీసుకొందన్న మోడీ

*కుదిరితే సయోధ్య కుదుర్చుకోవడం అలవాటు, కానీ, ప్రభుత్వాలను కూల్చడం సాధ్యం కాదన్న మోడీ

*పేద తల్లి కడుపులో పుట్టినవాడిని.. మీ కళ్లలోకి చూడలేనని చెప్పిన మోడీ

*నేను పనిచేసుకొంటూ వెళ్లేవాడిని

*మీ కళ్లలోకి చూసే మాట్లాడే ధైర్యం నాకు లేదు

*మీరు కళ్లతో ఆడే ఆటలను దేశమంతా చూస్తోందన్నారు.

* మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ఏమైందో అందరికీ తెలుసునన్నారు.

*చరిత్ర చెబుతోంది మీ కళ్లలో కళ్లు పెట్టి ఎవరూ చూడేరు

*నోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయడం మీకు అలవాటే

*చంద్రశేఖఱ్, దేవేగౌడ ప్రభుత్వాలను కూల్చారన్న మోడీ

*మద్దతిచ్చినట్టే ఇచ్చి చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చారు.

*2024లోనైనా తనను  ఓడించే శక్తిని ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించిన మోడీ

*ఒక్కఓటుతో వాజ్‌పేయ్ ను ఒడించారు.

*రాఫెల్ ఒప్పందం పారదర్శకంగా సాగిందన్నారు.

*మీరు తిట్టాలనుకొంటే మోడీని తిట్టాలన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైన్యాన్ని కాదని కోరిన మోడీ

*రాఫెల్ ఒప్పందం రెండు పార్టీల మధ్య జరగలేదన్నారు.

*రాఫెల్ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంగా చెప్పారు.

*రాఫెల్ గురించి ప్రధాని ప్రస్తావించారు.

*కొందరు శివుడి భక్తులుగా మారారు. నేను కూడ శివుడి భక్తుడినేనని చెప్పిన మోడీ

*నల్లధనంపై పోరాటం ఆగదన్న మోడీ

*డోక్లాం దేశ భద్రతకు సంబంధించి అంశమన్న మోడీ

*డోక్లాంను కూడ రాజకీయం చేస్తున్నారు.

*అవిశ్వాసం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమన్న మోడీ

*విపక్షాలకు తమపై తమకే నమ్మకం లేదు

*ఆర్థికంగా దేశం పురోగమనంలో ఉందన్న మోడీ

*2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన మోడీ

*కాంగ్రెస్ కు దేనిపై కూడ విశ్వాసం లేదన్నా మోడీ

*ప్రపంచం దేశాభివృద్ధిని గమనిస్తోందన్న మోడీ

*ఒక్క మోడీని దించేందుకు ఇంతమంది ఏకం అవుతున్నారన్న మోడీ

*ఈజ్ ఆఫ్ డూయింగ్, మేకిన్ ఇండియాలో భారత్ పురోగతి సాధించిందని ప్రకటించిన మోడీ

*ముద్ర యోజన ద్వారా 3 కోట్ల మందికి ఉపాధి కల్పించామన్న మోడీ

*10 వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు ప్రారంభమైనట్టు చెప్పిన మోడీ

*దేశంలో సుమారు 120 మొబైల్ తమ పాలనలో వచ్చాయన్న మోడీ

*రైతులకు పలు పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నామన్న మోడీ

*5 కోట్ల మందిని దారిద్య్రరేఖకు ఎగువకు తీసుకొచ్చామన్న మోడీ

*32 కోట్ల జన్ ధన్ ఖాతాను ప్రారంభించామన్న మోడీ

*4 ఏళ్లుగా 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్టు చెప్పిన మోడీ

*సబ్‌కా సాత్ సబ్‌ కా వికాస్ పేరుతో నాలుగేళ్లుగా  పాలన సాగుతోందన్న మోడీ

*టీడీపీ ఎంపీల నినాదాల మధ్యే మోడీ ప్రసంగం

* ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీల నినాదాలు

*వెల్‌లోకి దూసుకొచ్చిన టీడీపీ ఎంపీలు

*టీడీపీ ఎంపీలను తీసుకెళ్లాలని తోట నరసింహన్ని కోరిన స్పీకర్

*టీడీపీ ఎంపీలను తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరిన స్పీకర్

*మోడీ ప్రసంగాన్ని అడ్డుకొంటున్న టీడీపీ ఎంపీలు

*మీ స్వార్థ చింతనను ప్రజలు గమనిస్తున్నారన్న మోడీ

*ఇంకా ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు నన్ను దిగిపోవాలని కోరుతున్నారన్న మోడీ

*ప్రతిపక్షాలకు ఎందుకు తొంతర ఎందుకని ప్రశ్నించిన మోడీ

*అధికారంలో కోసం విపక్షాలు అర్రులు చాస్తున్నాయన్న మోడీ

*అభివృద్ధి నిరోధకులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తోందన్న మోడీ

*అహంకారపూరిత ధోరణి ఈ దిశగా పురిగొల్పుతోందన్న మోడీ

*సంఖ్యాబలం లేనప్పుడు అవిశ్వాసం ఎందుకు తెచ్చారనే ప్రశ్న కలుగుతోందన్న మోడీ

*30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న మోడీ

*మేం మాట్లాడితే భూకంపం వస్తోందనేవారు చర్చకు సిద్దం కాకుండా వచ్చారన్న మోడీ

*4 ఏళ్లలో ప్రభుత్వం చేసిన పనులను అందరూ సమర్ధించారు.

*ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఓ భాగమన్న మోడీ

*ప్రధాని మోడీ అవిశ్వాసంపై ప్రసంగం

*కేంద్రమంత్రి అథవాలే మోడీని అథవాలేతో పోల్చారు

Follow Us:
Download App:
  • android
  • ios