అవిశ్వాసం ఎఫెక్ట్: ఎంపీలకు విప్.. కొత్త చీఫ్ విప్‌ను నియమించిన బీజేపీ

No confidence motion: BJP, TDP, TMC Issued whip
Highlights

కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా పావులు కదుపుతోంది

కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సభకు విధిగా సభకు హాజరుకావాలని.. అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి మద్ధుతుగా వ్యవహిరించాల్సిందిగా తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.. మూడు లైన్లతో కూడిన విప్‌ను జారీ చేశారు.

మరోవైపు పార్టీ చీఫ్ విప్‌గా అనురాగ్ ఠాకూర్‌ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తమ ఎంపీలకు విప్ జారీ చేయాల్సిందిగా బీజేపీ కోరింది.. 

ఇక విపక్షాలు  కూడా అవిశ్వాసం విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.. మోడీ పట్ల.. బీజేపీ విధానాల పట్ల అసంతృప్తిగా  ఉన్న పార్టీల  నేతలను సంప్రదించి అవిశ్వాసానికి మద్ధతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, టీడీపీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
 

loader