న్యూఢిల్లీ:దేశంలో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. గురువారం నాడు మంత్రులు, నిపుణులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. 

కరోనా వైరస్ నియంత్రణ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.  కరోనా కేసుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ మూడో స్థానానికి చేరుకొంది. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. ప్రపంచంలో జనాభాలో ఇండియా రెండో స్థానంలో ఉంది. దీంతో దేశంలోని ప్రతి 10 లక్షల మందిలో 538 కేసులే నమోదౌతున్నాయన్నారు.

also read:కరోనాతో 21,129 మంది మృతి: ఇండియాలో 7,67,296కి చేరిన కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా సగటును పరిశీలిస్తే దేశంలో కరోనా కేనుల సంఖ్య 1453 మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ సగటు చాలా తక్కువగా ఉందన్నారు మంత్రి.

కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి  దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో కరోనా కేసులు 7,67,296కి చేరుకొన్నాయి. దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.