న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 24,879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 487 మంది మరణించారు.కరోనా సోకిన వారిలో 62.08 శాతం మంది రోగులు కోలుకొంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించింది.

దేశంలో గురువారం నాడు ఉదయానికి 7,67,296 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 4,76,378 మంది కోలుకొన్నారు. కరోనాతో దేశంలో 21,129  మంది మరణించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బుధవారంనాడు ఒక్క రోజునే 986 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో 24,823కి చేరుకొన్నాయి కరోనా కేసులు. ఒక్క రోజు వ్యవధిలోనే 23 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 827కి చేరుకొంది.

ALSO READ:24 గంటల్లో 482 మంది మృతి, ఇండియాలో 7,42,417కి చేరిన కరోనా కేసులు

జార్ఖండ్ రాష్ట్రంలో కొత్తగా 24 గంటల్లో 78 కరోనా కేసులు  నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలలో 66 మంది కరోనాతో కోలుకొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3134కి చేరుకొన్నాయి. ఇప్పటివరకు కరోనా సోకినవారిలో 2170 మంది కోలుకొన్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం నాడు ఒక్క రోజునే 10 మంది కరోనాతో మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,063కి చేరిన కరోనా కేసులు ఇందులో 4,715 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 482 మంది మరణించారు.

మరో వైపు ఇండోర్ లో ఇప్పటివరకు కరోనా కేసులు 5,043కి చేరుకొన్నాయి. 255 మంది కరోనాతో మరణించారు.