Union budget 2022: కార్పోరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింపు.. !

Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్, కార్పోరేట్ సర్‌ఛార్జీ గురించి కీలక ప్రకటన చేశారు. కార్పోరేట్ సర్‌ఛార్జీని 12 శాతం నుండి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు  వెల్ల‌డించారు. 
 

No change in Income Tax slabs, but budget slashes Corporate surcharge to 7% from 12%

Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను (Union budget 2022) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్, కార్పోరేట్ సర్‌ఛార్జీ గురించి కీలక ప్రకటన చేశారు. కార్పోరేట్ సర్‌ఛార్జీని 12 శాతం నుండి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు  వెల్ల‌డించారు. వ్యక్తిగత, కార్పోరేట్ ట్యాక్స్‌ను పన్నులకు సంబంధించి 2022-23 బడ్జెట్ (Union budget 2022)లో కేంద్రం కొన్ని ఊరట క‌లిగించే ప్రకటనలు చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్, కార్పోరేట్ సర్‌ఛార్జీని 12 శాతం నుండి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు. 

అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకు వచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. దీనిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్ఎస్‌పీ (National Pension System-NPS) డిడక్షన్ పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. డిజిటల్ అసెట్స్ ఆస్తుల లాభాల స్వీకరణపై 30 శాతం ట్యాక్స్  విధిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ఆస్తులను బదిలీ చేస్తే అదనంగా 1 శాతం టీడీఎస్ విధించనున్నామన్నారు.అయితే Income tax స్లాబుల్లో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. ఆదాయ పన్నుపై ఎలంటి కొత్త ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ప్రస్తావించలేదు. ట్యాక్స్ కు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో మార్పులేవని కేంద్ర ఆర్ధిక మంత్రి తేల్చి చెప్పారు. 

డిజిల్ క‌రెన్సీ గురించి కూడా ఈ బ‌డ్జెట్ (Union budget 2022) లో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్ర‌స్తావించారు.  డిజిటల్ కరెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బదలీపై 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపుకు అవకాశం లేద‌ని త‌లిపారు.  ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవ‌కాశం కూడా క‌ల్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. కాబ‌ట్ట‌లి ఇప్ప‌టి నుంచి ఐటీ రిటర్న్స్ సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవడానికి వీలు క‌లుగుతుంది. 

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి (GDP growth) 9.2 శాతంగా అంచనా వేస్తున్నామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. క్యాపెక్స్ కారణంగా పెట్టుబడుల పునరుద్ధరణ పుంజుకునే అవకాశం ఉందని వెల్ల‌డించారు.  క‌రోనా విజృంభ‌ణ‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం గురించి బ‌డ్జెట్ సెష‌న్ (Union budget 2022) ప్రారంభంలోనే మంత్రి మాట్లాడారు. క‌రోనా  వ్యాక్సినేష‌న్ వ‌ల్ల సవాళ్లను తట్టుకునే బలమైన స్థితిలో భారతదేశం ఉంద‌ని చెప్పారు. ‘‘ 2014 నుంచి ప్రభుత్వం దృష్టి పేద, అట్టడుగు వర్గాలపై ఉంది. మధ్యతరగతి వారికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని సీతారామన్ తన 2022-23 బడ్జెట్ (Union budget 2022)ప్రసంగంలో పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios