'అమిత్ షాకు బీహార్, ఇండియా గురించి గానీ ఏమీ తెలియదు'
బీహార్ లో అవినీతి రాజ్యమేలుతుందని అమిత్ షా చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. బీహార్ గురించి కేంద్ర హోంమంత్రికి ఎటువంటి అవగాహన లేదని ఏద్దేవా చేశారు.

బీహార్ లో అవినీతి రాజ్యమేలుతుందని అమిత్ షా చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. బీహార్ గురించి కేంద్ర హోంమంత్రికి ఎటువంటి అవగాహన లేదని ఏద్దేవా చేశారు. లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ ల పొత్తు "నూనె, నీరు"లా సాగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాదనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. రాష్ట్ర రాజధాని శివార్లలోని భక్తియార్‌పూర్ పట్టణంలో సీఎం నితీష్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలతో బిజీబిజీగా ఉన్నా.. కాబట్టి తాను ఇలాంటి వ్యక్తులను పట్టించుకోననీ, వారి మాటలను కూడా తాను పట్టించుకోనని నితీష్ కుమార్ అన్నారు.
ఉత్తర బీహార్‌లోని ఝంఝర్‌పూర్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా రాష్ట్ర పరిపాలనపై చేసిన ఆరోపణలను సీఎం నితీష్ కుమార్ తిప్పికొట్టారు. బీహార్ గురించి, తాము రాష్ట్రంలో చేస్తున్న పని గురించి ఏమీ తెలియదనీ, అలాగే ప్రధాని మోడీకి దేశం గురించి కూడా ఏమీ తెలియదని అన్నారు. '
మతతత్వ, బిజెపి అనుకూల పక్షపాతంతో 14 మంది వార్తా వ్యాఖ్యాత(జర్నలిస్టులు)లను బహిష్కరించడంపై సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తనకు దాని గురించి తెలియదనీ, తాను మొదటి నుంచి జర్నలిస్టులకు అండగా ఉన్నాననీ, జర్నలిస్టులకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, వారు చూసిన, ఇష్టపడే సత్యాన్ని తమదైన శైలిలో వ్రాస్తారు. జర్నలిస్టులను నియంత్రించలేమని అన్నారు. ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయనీ, తాము ఏ జర్నలిస్టుకు వ్యతిరేకం కాదని అన్నారు. తాము ప్రతి జర్నలిస్టును గౌరవిస్తామని అన్నారు.
బీహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన గురించి మాట్లాడుతూ.. అమిత్ షా చెప్పిన వాటిని తాము పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. వారికి బీహార్ పరిస్థితులపై అవగాహన లేదనీ, బీహార్ లో ఎంత అభివృద్ధి జరిగిందని అన్నారు. బీహార్‌లో ఎన్ని పనులు జరుగుతున్నాయన్న సమాచారం వారి వద్ద ఉందా? వారికి దేశం గురించి అయినా అవగాహన ఉందా ? అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో తాము ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడంలో బిజీగా ఉన్నందున వారు ఆందోళన, భయాందోళనలకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు.