బీజేపీ లేకుండా కూడా ప్రభుత్వాన్ని నడపగలమని బీహార్ సీఎం నితీష్ కుమార్ నిరూపించారని శివసేన తెలిపింది. ఆ పార్టీతో తెగదింపులు చేసుకోవడం ద్వారా ఆయన తుఫాన్ సృష్టించారని శివసేన కు చెందిన మరాఠీ దినపత్రిక ‘సామ్నా’ తన సంపాదకీయంలో కొనియాడింది. 

బీజేపీతో సంబంధాలు తెంచుకొని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తుఫాన్ సృష్టించార‌ని శివ‌సేన పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఇది పెద్ద స‌వాల్ అని తెలిపింది. శివ‌సేన‌కు చెందిన వార్తా ప‌త్రిక ‘సామ్నా’లో గురువారం ప్రచురితం అయిన సంపాదకీయం నితీష్ కుమార్ ను ప్రశంసించింది, బీజేపీ జనతాదళ్ (యునైటెడ్)ని రద్దు చేయాలని కోరుకుందని, అయితే దానికంటే ముందే నితీష్ కుమార్ బీజేపీతో సంబంధాలు తెంచుకొని ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపింది. 

From the IAF Vault: భారత వైమానిక దళానికి చెందిన తొలి హెలికాప్టర్ సికోర్‌స్కై ఎస్-55 స్టోరీ ఇదీ

జూన్‌లో సేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విషయాన్ని కూడా సామ్నా ప్రస్తావించింది. అత‌డు (షిండే) ఢిల్లీ ముందు మోక‌రిల్లాడు అని పేర్కొంది. అయితే అది (బీజేపీ) లేకుండా జీవించ‌వ‌చ్చ‌ని నితీష్ కుమార్ నిరూపించి చూపించార‌ని ఆయ‌న (షిండే) అర్థం చేసుకోవాల‌ని సంపాదకీయం పేర్కొంద‌ని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రతిప‌క్షాలు

నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) వ్యవస్థాపకుడు లాలూ యాదవ్ మధ్య విభేదాలు తక్షణమే పరిష్కరమ‌వ్వాల‌ని శివ‌సేన అభిప్రాయ‌ప‌డింది. 2020లో ఆర్జేడీ త‌రుఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన, అప్ప‌టి బీజేపీ-జేడీ(యూ) సంకీర్ణాన్ని సవాల్ చేసిన తేజస్వీ యాదవ్‌ను యువ, జనాదరణ పొందిన బీహార్ రాజకీయ నాయకుడు అని ప్రశంసించింది.

నేను ఎప్పుడూ వైస్ ప్రెసిడెంట్ కావాలని కోరుకోలేదు - బీహార్ సీఎం నితీష్ కుమార్

కాగా.. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో RJD, JD(U) పరస్పరం పోటీ పడ్డాయి. లాలూ ప్రసాద్‌తో కుమార్‌కు మధ్య ఉన్న సంబంధం గత నాలుగు దశాబ్దాలుగా మారిపోతూ వస్తోంది. అయితే హ‌ఠాత్తుగా నితీష్ కుమార్ మంగళవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నుంచి వైదొలిగి ఆర్జేడీతో క‌లిసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు. సేన సంపాదకీయం ప్రకారం.. మాజీ కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ కు మద్దతు ఇచ్చి బీజేపీ జేడీ(యూ)ని అస్థిరపరిచేందుకు ప్ర‌య‌త్నించింది. దీనిని గ్ర‌హించిన కుమార్ బీజేపీని విడిచిపెట్టారు. ‘‘ నితీష్ కుమార్ తుఫాను సృష్టించారు. అది బీజేపీకి సవాలుగా మారవచ్చు ’’ అని సామ్నా పేర్కొంది.

చిన్నారులతో ప్రధాని మోదీ రక్షా బంధన్ సెలబ్రేషన్.. వారంతా ఎవరంటే..

సోషలిస్టు నాయకుడు జై ప్రకాష్ నారాయణ్ సొంత రాష్ట్రమైన బీహార్‌లో రాజకీయ పరిణామాలు దేశమంతటా కనిపిస్తున్నాయని సంపాదకీయం తెలిపింది. రాష్ట్ర కొత్త రాజకీయ పునర్విభజన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదని పేర్కొంది. కాగా.. బీహార్‌లో 40 మంది లోక్‌సభ సభ్యులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో 80, మహారాష్ట్ర లో 48, పశ్చిమ బెంగాల్ లో 42 లోక్ స‌భ ఎంపీ స్థానాలు ఉన్నాయి.