"మహా" ప్రతిష్టంభన: రంగంలోకి భగవత్, హుటాహుటిన నాగ్ పూర్ కు గడ్కరీ

రాజీ ఫార్ములాగా మహారాష్ట్ర సీఎంగా నితిన్ గడ్కరీ పేరును ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి, శివసేన మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి గడ్కరీ పేరును మధ్యేమార్గంగా భగవత్ సూచిస్తున్నట్లు సమాచారం.

Nitin Gadkari's Sudden Flight To Nagpur As Time Runs Out In Maharashtra

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు అంతం పలకడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. బిజెపి, శివసేన మధ్య అధికార పంపకాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన నాగ్ పూర్ బయలుదేరారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్న స్థితిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

Also Read: బీజేపీతోనే తేల్చుకోండి.. మేము ప్రతిపక్షంగానే ఉంటాం: శివసేనకు పవార్ సూచన

మహారాష్ట్రకు చెందిన బిజెపి నేత గడ్కరీ మోహన్ భగవత్ ను కలుస్తారని సమాచారం. మహారాష్ట్రలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి కొంత మందిని కలుస్తానని తన అకస్మాత్తు నాగ్ పూర్ పర్యటనపై స్పందిస్తూ నితిన్ గడ్కరీ ఎన్డీటీవీతో చెప్పారు. 

మరోవైపు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కనలుసుతన్నారు. ముఖ్యమంత్రిగా నితిన్ గడ్కరీ పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బిజెపి, శివసేన మధ్య రాజీ ఫార్ములాగా ఆయన పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. 

Also Read: మహా మలుపుల మహా రాజకీయం:శివసేన సంచలన ప్రకటన.

ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకుందామనే తమ ప్రతిపాదనకు ఫడ్నవీస్ అంగీకరించకపోవడంపై శివసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ భగవత్ ను ఫడ్నవీస్ మంగళవారం రాత్రి కలిశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన పరిణామాలు వేగవంతమైనట్లు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios