Nita Ambani: ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ  భార్య నీతా అంబానీ. ఆమె ప్రతిష్టాత్మక సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు 2023-24 ను అందుకున్నారు.

Nita Ambani: నీతా అంబానీ.. ప‌రిచ‌యం అవసరం లేని పేరు. ప్రముఖ వ్యాపార దిగ్గజం, ఏసియా రిచెస్ట్ పర్సన్ ముఖేశ్ అంబానీ భార్య. ఆమె ఓ ఇల్లాలిగానే కాకుండా.. రిలయన్స్ సహ సారథిగా, స‌క్సెస్ ఫుల్‌ ఉమెన్ బిజినెస్‌ పర్సనాల్టీగా త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను ఆమె క్రియేట్ చేసుకుంది.

ఆమె దేశంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావితమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. నేడు ఆమె ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తోంది. కాగా.. తాజాగా శ్రీమతి నీతా అంబానీ ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకుంది. రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుండి ప్రతిష్టాత్మకమైన సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు 2023-24 అందుకుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు, సంస్కృతిలో పరివర్తనాత్మక మార్పులు తీసుకరావడంలో ఆమె నిరంతర కృషికి గాను ఈ గుర్తింపు లభించింది.