Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ 2021: ఆస్ట్రేలియాపై భారత విజయాన్ని ప్రస్తావించిన నిర్మల

2021- 22 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌‌ను భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె టీమ్‌ఇండియాను కొనియాడారు. 

nirmala sitharaman praised team indias victory over australia in the parliament budget session ksp
Author
New Delhi, First Published Feb 1, 2021, 4:02 PM IST

2021- 22 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌‌ను భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె టీమ్‌ఇండియాను కొనియాడారు.

ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్‌ సాధించిన అద్భుత విజయాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే దేశంగా ఉన్న భారత్‌.. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించాక మనం పొందిన అనుభూతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు.

ఆ విజయం ప్రజలకే కాకుండా ముఖ్యంగా యువతలోనూ స్ఫూర్తి నింపిందని.. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎలా ముందుకు సాగాలనే విషయాన్ని స్పష్టం చేసింది. ఓటముల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసి గెలవాలన్న దాహార్తిని, కసిని రగిలించిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.  

Also Read:వైద్య ఆరోగ్య రంగంపై దృష్టి: నిర్మలా సీతారామన్

కాగా, అడిలైడ్‌లో జరిగిన డే/నైట్‌ టెస్టులో టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో నిలిచినా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. 36 పరుగులకే ఆలౌటై ఘోర అవమానాన్ని మూట గట్టుకుంది.

దీంతో భారత్ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పితృత్వ సెలవుల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరవ్వడం, కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును మరింత భయపెట్టాయి.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలు అందుకున్న రహానె యువ ఆటగాళ్లతో మెల్‌బోర్న్‌, గబ్బా టెస్టులు గెలిచి ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. దాంతో భారత్‌ 2-1 తేడాతో చారిత్రక విజయం సాధించింది. తాజాగా జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలోనూ ప్రధాని నరేంద్రమోదీ భారత జట్టును కొనియాడిన సంగతి తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios