న్యూఢిల్లీ:వైద్య, ఆరోగ్య రంగంపై ఎక్కువ దృష్టి సారించినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సోమవారం నాడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

also read:కేంద్ర బడ్జెట్ 2020-21: పెరగనున్న మొబైల్ ధరలు, తగ్గనున్న బంగారం, వెండి ధరలు

మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పారు. . కరోనా వేళ వైద్య పరీక్షలకు సౌకర్యం లేక ఇబ్బందులు పడినట్టుగా  చెప్పారు. వైద్య, ఆరోగ్యరంగంపై ఎక్కువ దృష్టి సారించినట్టుగా తెలిపారు. 

కరోనా వేళ వైద్య పరీక్షలకు సౌకర్యం లేక ఇబ్బందులు పడినట్టుగా మంత్రి చెప్పారు. బడ్జెట్ లో ఆర్ధిక వ్యవస్థకు ఎక్కువ ప్రేరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. దీంతో ల్యాబ్ లు, వైరాలజీ సంస్థల ద్వారా మౌళిక వసతులను కల్పించనున్నట్టుగా చెప్పారు. రహదారులు, వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి, ఓడ రేవులపై అధికంగా ఖర్చు చేయనున్నట్టుగా మంత్రి వివరించారు. 

బడ్జెట్ రూపకల్పన చేసే సమయంలో తమ ముందు రెండు ప్రధాన లక్ష్యాలున్నాయని ఆమె గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ది సెస్ ను పెట్రోల్ రూ. 2.50, డీజీల్ కు రూ. 4 చొప్పున కేంద్రం ప్రతిపాదించింది.

వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మంత్రి చెప్పారు. వినియోగదారులు ఎక్కువ చెల్లించకుండా పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయ మౌళిక సదుపాయాల అభివృద్ది  సెస్ ను తీసుకొస్తున్నామన్నారు.