కేంద్ర బడ్జెట్ 2023 : ఎరుపురంగు టెంపుల్ బార్డర్ చీరలో నిర్మలాసీతారామన్..
ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ టెంపుల్ బార్డర్ ఎరుపురంగు చీరలో బడ్జెట్ సమర్పణకు హాజరయ్యారు. ఆ చీర ప్రత్యేకత ఏంటంటే..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023 - 24 కేంద్ర బడ్జెట్ ను ఆమె సమర్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఐదోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం. ప్రతీసారి లాగే ఈసారి కూడా నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో ఆమె పార్లమెంటుకు హాజరయ్యారు.
అనేక సందర్భాల్లో ఆమె తనకు చీర మీద ఉన్న మక్కువను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్ సమర్పించే సమయంలో ఆమె టెంపుల్ బోర్డర్ ఉన్న ఎరుపు రంగు చీరను కట్టుకున్నారు. ఈ టెంపుల్ చీరలను నూలుతో, పట్టుతో లేదా నూలు పట్టు రెండింటి మిశ్రమంగా సాధారణంగా నేస్తుంటారు. చాలామంది వీటిని ప్రత్యేక సందర్భాల కోసం..స్పెషల్ గా తయారు చేయించుకుంటారు.
అలాగే బడ్జెట్ సందర్భంగా నిర్మల సీతారామన్ కూడా ఇలాంటి చీరను ప్రత్యేకంగా ధరించారు. ఆమె ధరించిన ఎరుపు రంగు టెంపుల్ బోర్డర్ చీరకు నల్లని బోర్డర్, ఇంట్రికేట్ గోల్డెన్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఐదోసారి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. . దేశ ఆర్థిక పరిస్థితులు, సాధారణ ప్రజల ఆశల మధ్య సమతుల్యతను పాటించడం నిర్మల సీతారామన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే పార్లమెంటులో బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి.