హాట్ టాపిక్ గా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చీరల రంగులు.. రూ.10నుంచి రూ.2000నోట్ల కలర్స్ లో కాటన్ చీరలు..

నేడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. భారత కరెన్సీకి సరిపోయే రంగు చీరలను ఆమె ధరించడం అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. 

Finance Minister Nirmala Sitharamans saree colors often match the colors of the country's currency - bsb

ఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు సంబల్‌పురి చీరలంటే చాలా ఇష్టం. వీటిని ధరించడం ఆమె గర్వంగా భావిస్తారు. వీటితో పాటు ఇకత్, కంజీవరం చీరలు అంటే ఇష్టం. నలుపు రంగును చాలావరకు అవాయిడ్ చేస్తారు. అందమైన చీరల సేకరణకుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టింది పేరు. అంతేకాదు, ఆమె చీరల రంగులు తరచుగా దేశంలోని కరెన్సీ రంగులతో సరిపోతాయి. రూ.10 నుంచి రూ.2,000 నోట్ల రంగుకు మ్యాచ్ అయ్యే రంగు చీరల్లో ఆమె చాలా సందర్భాలలో కనిపిస్తుంటారు.

నేడు 2023-24 బడ్జెట్‌ను సమర్పణ ఉన్న నేపథ్యంలో, నిర్మలాసీతారామన్ ఏ రంగు చీరలో కనిపిస్తారనే దానిమీదే అందరిలో ఆసక్తి ఉంది. నిర్మల సీతారామన్ వ్యక్తిత్వం ఆమె ధరించే చేనేత, పట్టు చీరల్లో ప్రతిఫలిస్తుంది. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. ప్రత్యేక సందర్భాలలో, ఆమె ఎక్కువగా సంబల్‌పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంటారు.  ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారు.

నిర్మలా సీతారామన్ ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తారు. ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆమె తన వస్త్రధారణలో పెద్దగా మార్పులు చేయలేదు. చీర కట్టుకుని, ఆమె సాధారణ భారతీయ గృహిణిలాగే కనిపిస్తారు.

ప్రతి సంవత్సరం బడ్జెట్‌ సమర్పణకు ముందు నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుకలు నిర్వహిస్తారు. అలాంటి వేడుకల్లో ప్రతీసారి నిర్మలా సీతారామన్ చీరపై తనకున్న ప్రేమను కనబరుస్తూ ఉంటారు. నిర్మలా సీతారామన్ 17 డిసెంబర్ 2022న ఢిల్లీలోని జన్‌పథ్‌లో చేనేత హాత్‌ను సందర్శించి, చీరల పట్ల తనకున్న అభిమానాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆమె సౌత్ సిల్క్ చీర కట్టుకుని కనిపించింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఈవెంట్ ఫొటోను షేర్ చేశారు. MySariMyPride అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా వాడారు.

ఆర్థిక మంత్రి తన చీరల రంగును మన కరెన్సీ నోట్ల రంగులతో ఎలా మ్యాచ్ చేస్తారో కొన్ని ఉదాహరణలు.. 

అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆమె ధరించిన మణిపురి చీర రంగు రూ.10 నోటు రంగుతో సరిపోతుంది.30 జనవరి 2019న, అమరవీరుల దినోత్సవం నాడు, నిర్మలా సీతారామన్ రాజ్‌ఘాట్‌లో క్రీమ్ కలర్ మోడ్రాంగ్ ఫై ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన మణిపురి చీరను ధరించారు. మణిపూర్‌లోని మోయిరాంగ్ గ్రామంలో ‘మొయిరాంగ్‌ఫీజిన్’ డిజైన్‌తో ఈ చీర తయారు చేయబడింది.

Finance Minister Nirmala Sitharamans saree colors often match the colors of the country's currency - bsb

ఇక, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ రూ. 20 నోటు రంగుకు పోలిన కలర్ చీరలో కనిపించారు. ఆకుపచ్చ మంగళగిరి సాధారణ కాటన్ చీరలో కనిపించారు. ఈ చీరలు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతాయి.

Finance Minister Nirmala Sitharamans saree colors often match the colors of the country's currency - bsb

విలేకరుల సమావేశంలో రూ.50 నోటు రంగుతో మ్యాచ్ అయ్యే కలర్ జమ్దానీ చీర ధరించారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నీలం రంగు జమ్దానీ చీర ధరించి కనిపించారు.ఆమె చీరల్లో ఎక్కువగా బ్లూ కలర్ కనిపిస్తాయి. ఆమెకు కూడా ఎలిజబెత్ రాణికి ఇష్టమైన  బ్లూ కలరే ఇష్టం. 

సీతారామన్ అనేక సందర్భాల్లో లిలక్ చీరల్లో కనిపిస్తారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆమె ఒక్కసారి మాత్రమే రూ. 100 రూపాయల నోటు రంగుతో సరిపోయే కలర్ సంబల్‌పురి (ఒడిశా) ఇకత్ చీరను ధరించింది.

ఆర్థిక మంత్రి అయిన తర్వాత నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ను ఆరెంజ్ కలర్ కాటన్ చీరలో కలిశారు. అది రూ. 200 నోటు రంగు చీర అని ప్రత్యేకంగా చెప్పాలా?

అక్టోబర్ 2022లో, నిర్మల అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు రూ.500 నోటు రంగుతో కూడిన చీరను ధరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు సమావేశంలో, ఆమె బూడిద రంగు (జహర్మురహర) దక్షిణ కాటన్ చీరను ధరించింది.

ఇక వీటితో పాటు ఆర్థిక మంత్రి ప్రత్యేక సందర్భాలలో ఎరుపు రంగు చీరలను ధరించడానికి ఇష్టపడతారు. అలాంటి షేడ్స్ ఉన్న చీరలనే ఎంచుకుంటారు. బడ్జెట్ రోజున, ఆమె తరచుగా రెడ్ కలర్ షేడ్స్ చీరలో కనిపిస్తుంటారు. కానీ, ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios