నిర్భయ ఘటన.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హింసించి, ప్రైవేట్ భాగాల్లో రాడ్లు పెట్టి... ఆలయ ట్రస్టు సభ్యుల ఘోరం..
మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఒక ఆలయ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను దారుణంగా కొట్టి, ప్రైవేట్ భాగాల్లో రాడ్లు చొప్పించారు.

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని మైహార్ పట్టణంలోని ప్రముఖ దేవాలయం నిర్వహిస్తున్న ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనేకసార్లు కొట్టారు. క్రూరంగా హింసించారు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
గురువారం నాడు అత్యాచారం తరువాత వారు ఆ చిన్నారి ప్రైవేట్ భాగాలలో గట్టి వస్తువును చొప్పించారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిని ఇప్పుడే నిర్థారించలేమని.. ఆమె వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దీనిని నిర్ధారించగలమని సీనియర్ అధికారి తెలిపారు.
తీవ్ర రక్తస్రావమైన బాలికను అధునాతన వైద్య సంరక్షణ కోసం డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ రీవాలోని ఆసుపత్రిలో చేర్చామని, నిందితులను రవీంద్ర కుమార్ రవి మరియు అతుల్ భడోలియాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Manipur violence: మణిపూర్ లైంగిక వేధింపులపై సీబీఐ విచారణ షురూ.. ఎఫ్ఐఆర్ నమోదు
“నిందితులు రవీంద్ర కుమార్ రవి, అతుల్ భడోలియా అనే ఈ నిందితులు 12 ఏళ్ల చిన్నారి ప్రైవేట్ పార్ట్‌లలో కర్ర లేదా మరేదైనా వస్తువును చొప్పించారనేదాన్ని నేను కాదనడంలేదు. అయితే ఇది కేవలం మెడికల్ రిపోర్టులో మాత్రమే తేలే విషయం. అందుకే మేం ఆమె మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆమెకు రక్తస్రావం అవుతోంది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు”అని సత్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశుతోష్ గుప్తా ఫోన్‌లో తెలిపారు.
"ఆమె శరీరంపై లైంగిక వేధింపులకు సంబంధించిన గాట్లు, గాయాలు ఉన్నాయి" అని చెప్పాడు. బాలిక పరిస్థితి గురించి చెబుతూ.. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుల బృందం ఆమె పరిస్థితి 'బాగానే ఉంది' అని చెప్పిందని ఎస్పీ చెప్పారు.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని గుప్తా తెలిపారు.
30 ఏళ్ల వయసున్న నిందితులను శుక్రవారం స్థానిక కోర్టులో హాజరుపరిచామని, వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని గుప్తా తెలిపారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376డిబి (12 ఏళ్లలోపు చిన్నారిపై సామూహిక అత్యాచారానికి శిక్ష), 366A (మైనర్ బాలికను స్వాధీనం చేసుకోవడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 324 (స్వచ్ఛందంగా గాయపరచడం), 34 (సాధారణ ఉద్దేశం) లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
మా శారదా దేవి మందిర్ మేనేజ్‌మెంట్ కమిటీ, మైహర్, దాని నిర్వాహకుడి సంతకంతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన వెంటనే, రవి, భడోలియాలను తమ సంస్థ నుండి తొలగించినట్లు పేర్కొన్నారు. వారి అసభ్యకరమైన చర్య ఆలయ ప్రతిష్టను దిగజార్చిందని ఆ ప్రకటన పేర్కొంది.
జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయ పట్టణం మైహార్‌లో అత్యాచార ఘటన జరిగిందని మరో అధికారి తెలిపారు. నిందితులు బాలికను ప్రలోభపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, దాడి చేశారని తెలిపారు. శుక్రవారం ఉదయం పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు మైహార్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డిఓపి) లోకేశ్ దబర్ తెలిపారు.
మైహార్‌లో ప్రథమ చికిత్స అందించిన అనంతరం బాధితురాలిని రేవా ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాలికకు అత్యుత్తమ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనను ఖండిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ మాట్లాడుతూ, ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ కేసును తలపించే విధంగా బాధితురాలు అమానవీయ దాడికి గురైందని అన్నారు.
నిర్భయ కేసు 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 ఏళ్ల మహిళపై అత్యాచారం, ఘోరమైన దాడి జరిగింది, ఇది దేశవ్యాప్త ఆగ్రహానికి కారణమైంది. నిరసనలను రేకెత్తించింది. మధ్యప్రదేశ్‌లో అక్కాచెల్లెళ్లు, కూతుళ్లతో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయని, వారికి భద్రత కల్పించడంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం విఫలమైందని ఇది రుజువు చేసిందని నాథ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. బాలికకు ఉత్తమ వైద్యం అందించి కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.