న్యూఢిల్లీ: నిర్భయ దోషులను ఉరిశిక్షను అమలు చేసేందుకు నియమించిన తలారి పవన్ జల్లాద్  శుక్రవారం నాడు తీహార్ జైలు అధికారులకు రిపోర్టు చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Also read:నిర్భయ కేసు: ఉరికి ఒక్క రోజు ముందు పవన్ గుప్తా మరో మెలిక

శుక్రవారం నాడు పవన్  ఉరి తీయడంపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ నలుగురు నిందితులకు ఉరి తీసేందుకు తాను సిద్దంగా ఉన్నానని  పవన్ జల్లాద్ ఇదివరకే ప్రకటించారు.శుక్రవారంనాడు పవన్ జల్లాద్  ఇప్పటికే డమ్మీలతో ట్రయల్స్ నిర్వహించారు. తీహార్ జైలులో పవన్ జల్లాద్‌కు  జైలులో ప్రత్యేక వసతిని ఏర్పాటు చేశారు. 

ఇలాంటి వ్యక్తులు ఉరి తీయబడాల్సిన అవసరం ఉందని పవన్ జల్లాద్ అభిప్రాయపడ్డారు.  ఇదిలా ఉంటే నిర్భయ కేసులో పవన్ గుప్తా శుక్రవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

నిర్భయ పై  గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో  తాను మైనర్ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయడాన్ని  తిరిగి సమీక్షించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

 తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు.  నిర్భయ కేసులో దోషులకు ఉరి విధించేందుకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.