న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్షను వాయిదా వేస్తూ కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషులకు రేపు ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉండింది. ఈ స్థితిలో కోర్టు ఉరిశిక్షను వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దోషులను ఉరితీయకూడదని ఆదేశించింది.

నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షను వాయిదా వేయడానికి గల కారణాన్ని వివరిస్తూ పాటియాల హౌస్ కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాధితుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఉరిశిక్ష పడిన ఓ దోషి  న్యాయపరమైన అన్ని అవకాశాలను వాడుకునే అవకాశాన్ని తనకు కోర్టులు కల్పించలేదనే బాధతో సృష్టికర్త వద్దకు వెళ్లకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

Also Read: నిర్భయ కేసు: దోషులకు రేపు ఉరి లేదు, మూడోసారి వాయిదా

నిర్భయ కేసులో దోషి పవన్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ క్యురేటీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం అతనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ పిటిషన్ పెండింగులో ఉందని, అందువల్ల  దోషులు న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను వాడుకోలేదని న్యాయమూర్తి చెప్పారు. 

 నిర్భయ కేసు దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్ సింగ్ లను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఇంతకు కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. దానిపై ఇప్పుడు స్టే విధించింది. 

Also Read: నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీం షాక్, క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. వైద్య విద్యార్థిని సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిలో ఒకతను మైనర్ కావడంతో అతను శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.