న్యూఢిల్లీ: ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులన్నీ విడిపోయి నిర్భయ కేసు దోషులు నలుగురికి శుక్రవారం తెల్లవారు జామును ఉరి శిక్ష అమలైంది. నలుగురు దోషులను ఒక్కేసారి ఉరితీశారు. జైలు నెంబర్ 3లో వారిని ఉరి తీశారు.

ఒక్కో దోషి వెంట నలుగురు 12 మంది గార్డులు ఉన్నారు. ఉరి కంబం వద్ద 48 మందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఉరి తీసే సమయంలో నలుగురు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ బోరును విలపించాడు. ఉరి వేసిన తర్వాత అర గంట పాటు దోషులకు ఉరికంబానికి వేలాడనున్నారు.

Also Read: ఉరికి ముందు కూడా డ్రామాలు ఆపని నిర్భయ దోషులు, ఏమి చేశారంటే...

దోషులను ఉరి తీసే సమయంలో తీహార్ జైలు వెలుపల సంబరాలు చేసుకున్నారు. తమకు న్యాయం జరిగిందని తీహార్ జైలు వద్ద నిర్బయ తల్లి ఆశాదేవి అన్నారు. 

నిర్భయ కేసు దోషులను నలుగురిని తీహార్ జైలులో శుక్రవారం ఉదయం సరిగ్గా 5.30 గంటలకు ఉరి తీశారు. పవన్ జలాద్ వారికి ఉరేశాడు. వారిని ఉరి తీయడానికి మూడు సార్లు కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. చివరకు మూడో డెత్ వారంట్ అమలైంది. దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత నిర్భయ కేసు దోషులకు శిక్ష పడింది. 

Also Read: నిర్భయ కేసు: తీహార్ జైల్లో దోషులకు ఉరి పడింది

ముకేష్ సింగ్  సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లకు ఉరి శిక్ష పడింది. ఈ నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉండగా, ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు వైద్యవిద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల తర్వాత 2012 డిసెంబర్ 29వ తేదీన ఆమె మరణించింది.