న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్ కుమార్  దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ నుండి  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకొన్నారు.  కొత్త బెంచీ ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.

Also read:నిర్భయ దోషులను నేనే ఉరితీస్తా... రక్తంతో మహిళ లేఖ

నిర్భయ కేసులో  నిందితుడు అక్షయ్ కుమార్  తనకు విధించిన కేసును సమీక్షించాలని  సుప్రీంకోర్టులో అక్షయ్‌ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టును స్వీకరించింది. నిర్భయపై గ్యాంగ్ రేప్, హత్య కేసుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు ఈ కేసును వాదిస్తోంది.

దీంతో  ఈ కేసు విచారణ చేసే ధర్మాసనం నుండి  చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే తప్పుకొన్నారు. ఈ కేసును మరో ధర్మాసనం విచారణ చేయనుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే  ప్రకటించారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు రేపు విచారణ చేయనుంది.

మరోవైపు నిర్భయపై గ్యాంగ్ రేప్ జరిగి హత్య జరిగి ఈ నెల 16వ తేదీ నాటికి  ఏడేళ్లు అవుతోంది. నిందితులకు ఉరిశిక్ష పడినప్పటికీ కూడ వారికి ఇంకా ఉరిశిక్ష తీయాలనే డిమాండ్ తీవ్రమైంది. తీస్‌హాజరి జైలు వద్ద మహిళా సంఘాలు ఈ నెల 16వ తేదీన నిర్భయ నిందితులను తమకు అప్పగిస్తే ఉరి తీస్తామని చెప్పారు.