Nipah In Kerala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇ-సంజీవిని టెలిమెడిసిన్ సిస్టమ్ ప్రారంభం..
Nipah In Kerala: నిపా వైరస్‌పై పోరాడేందుకు కేరళ ప్రభుత్వం ఓపీడీ సేవను ప్రారంభించింది. నిపా వైరస్ సంక్రమణ దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం తన ఇ-సంజీవని టెలిమెడిసిన్ సిస్టమ్ కింద ప్రత్యేక ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవను ప్రారంభించింది.

Nipah In Kerala: కేరళలో నిపా వైరస్ సంక్రమణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌పై పోరాడేందుకు కేరళ ప్రభుత్వం ఓపీడీ సేవను ప్రారంభించింది. ఇ-సంజీవని టెలిమెడిసిన్ సిస్టమ్ పేరిట ప్రత్యేక ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవను ప్రారంభించింది.
ఈ సందర్భంగా కోజికోడ్ జిల్లా కలెక్టర్ (DC) ఎ.గీత మాట్లాడుతూ... నిపా సంబంధిత భయాందోళనలను దూరం చేయడంలో ఈ సేవ దోహదపడుతుందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఉన్న వ్యక్తులు డాక్టర్‌ని సందర్శించకుండానే ఆన్‌లైన్‌లో వైద్య సహాయం పొందవచ్చు. ఈ-సంజీవని నిపా OPD సేవ ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇ-సంజీవని ప్లాట్‌ఫారమ్ ద్వారా, మీరు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చికిత్స పొందవచ్చని తెలిపారు.
కొత్త నిపా వైరస్ కేసుల్లేవ్
ఇదిలావుండగా, కేరళలో వరుసగా రెండో రోజు కూడా నిపా వైరస్ కొత్త కేసులేవీ నమోదు కాలేదని కేరళ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురికి నిపా సోకింది. వారిలో ఇద్దరు ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణించారు. పరిస్థితి అదుపులో ఉంది.
గతంలో కూడా నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి. కేరళలో నాల్గవ సారి నిపా వైరస్ సంక్రమణ కేసు నిర్ధారించబడింది. ఇంతకుముందు, 2018, 2021లో కోజికోడ్‌లో, 2019లో ఎర్నాకులంలో కేసులు నమోదయ్యాయి.