గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం, తొమ్మిదిమంది సజీవదహనం

nine peoples died in a road accident at gujarat
Highlights

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సౌరాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవదహనమయ్యారు.  ట్రక్కు-కారు ఢీ కొట్టుకోవడం, వెంటనే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు కుచ్ నుంచి రాజ్‌కోట్‌కు ఓ కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మోర్బి పట్టణ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. కారు, ట్రక్కు మితిమీరిన వేగంతో ఢీ కొన్నాయి. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ట్రక్కు డ్రైవర్ ఈ ప్రమాదం నుండి సైఫ్ గా బైటపడి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
  
loader