Asianet News TeluguAsianet News Telugu

ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మృతదేహాలు.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది డెడ్ బాడీలు లభించాయి. వారి ఇంట్లో వారంతా విషం తీసుకుని సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

nine family members suspected suicide deadbodies found in maharashtra
Author
Mumbai, First Published Jun 20, 2022, 6:43 PM IST

ముంబయి: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. సాంగ్లి జిల్లాలో ఓ ఇంట్లో ఏకంగా తొమ్మిది డెడ్ బాడీలు కనిపించాయి. పరిశీలించి చూస్తే.. ఆ మృతదేహాలు అన్ని కూడా ఒకే కుటుంబానికి చెందినవి. దీంతో ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఆ ఇల్లు శ్మశానాన్ని తలపించింది. తెల్లారే సరికి పరిస్థితులు మొత్తం తలకిందులుగా కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఆ ఊరంతా విషాద వాాతావరణం నెలకొంది. ఈ ఘటన సాంగ్లి జిల్లాలోని మైసాల్ టౌన్‌లో చోటుచేసుకుంది.

మైసాల్ టౌన్‌లో మాణిక్, పోపట్ యల్లప్ప వాన్‌మోర్ సోదరులు కలిసే జీవిస్తున్నారు. మాణిక్ పెద్దాయన.. పోపట్ యల్లప్ప వాన్‌మోర్ చిన్నాయన. సోదరులు ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. ఆ సోదరుల కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. అయితే, ఈ రెండు కుటుంబాల సభ్యులు ఆ ఇంట్లో విగతజీవులై కనిపించారు. మాణిక్ వెటెరినరీ వైద్యుడిగా పని చేసేవాడు.

ఈ కుటుంబం ఊరిలో నుంచి ప్రతి రోజు ఉదయం పాలు తెచ్చుకునేదని స్థానికులు చెప్పారు. అయితే, ఆ రోజు ఉదయం పాాలు అమ్మేవారికి దగ్గరకు ఈ కుటుంబం నుంచి ఎవరూ వెళ్లలేదు. దీంతో ఆ పాలు అమ్మే వారి నుంచి ఓ అమ్మాయి ఇంటికి వచ్చి చూడగాా.. మృతదేహాలు కనిపించాయి. అనంతరం, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మాణిక్ నివాసంలో మాణిక్ సహా తల్లి, భార్య, ఇద్దరు పిల్లల డెడ్ బాడీలు లభించాయి. కాగా, పోపట్ నివాసంలో పోపట్ మృతదేహంతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లల డెడ్ బాడీలు లభ్యం అయయ్యాయి.

కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పురుగుల మందు తాగి వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, వారి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్టులోనే వెల్లడి అవుతాయని పోలీసులు చెప్పారు.

అయితే, వారు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఆ అప్పుల కారణంగా కుటుంబం మొత్తం ఈ కఠిన నిర్ణయాాన్ని తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.

ముగ్గురు మృతదేహాలు ఒక చోట.. మిగిలిన ఆరుగురు డెడ్ బాడీలు వేర్వేరు ప్రాంతాల్లో లభించాయని సాంగ్లి ఎస్పీ దీక్షిత్ గేదామ్ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios