ఐదేళ్ల నాటి కల్తీ సారా కేసులో బిహార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర కలకలం సృష్టించిన ఈ కల్తీసారా కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది

ఐదేళ్ల నాటి కల్తీ సారా కేసులో బిహార్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర కలకలం సృష్టించిన ఈ కల్తీసారా కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదే వ్యవహారంలో దోషులుగా తేలిన నలుగురు మహిళలకు జీవిత ఖైదు విధించింది. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చారు. ఇవాళ మ‌ర‌ణ‌శిక్ష ప‌డిన 9 మంది ఒకే కుటుంబానికి చెందిన‌వారు కావ‌డం విశేషం.

2016 ఆగ‌స్టులో గోపాల్‌గంజ్ జిల్లాలోని ఖ‌ర్జుర్‌బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన ఘ‌ట‌న‌లో 21 మంది మ‌ర‌ణించగా.. కొందిరిక కంటి చూపు పోయింది. ఇదే కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల‌పై ప్రభుత్వం వేటు వేసింది. 21 మంది పోలీసుల్ని డిస్మిస్ చేసింది. వీరిలో ముగ్గురు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు కూడా ఉన్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.